మైక్రోసాఫ్ట్‌ను వీడుతున్న మహిళా ఉద్యోగులు..

Published on Thu, 10/24/2024 - 14:01

ప్రపంచ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో వింత ధోరణి కనిపిస్తోంది. సంస్థను వీడుతున్న ఉద్యోగుల్లో అత్యధికం మహిళలే ఉంటున్నారు. నిష్క్రమిస్తున్న వారిలో లాటిన్స్‌, నల్ల జాతీయులు ఉండటంతో కంపెనీ శ్రామికశక్తి వైవిధ్యంపై ప్రభావం చూపుతోంది.

మైక్రోసాఫ్ట్‌ డైవర్సిటీ అండ్‌ ఇన్‌క్లూషన్‌ నివేదిక ప్రకారం.. జూన్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా కంపెనీని వీడివెళ్లిన ఉద్యోగుల్లో మహిళలు 32.7% మంది ఉన్నారు. ఇది అంతకు ముందు ఏడాదితో పోల్చితే 31% పెరిగింది. స్వచ్ఛంద నిష్క్రమణలు, తొలగింపులు అన్నింటినీ క్రోడీకరించి రూపొందించిన ఈ రిపోర్ట్‌ను తాజాగా విడుదల చేశారు.

దెబ్బతింటోన్న వైవిధ్యం
అమెరికాకు సంబంధించిన నిష్క్రమణలలో నల్లజాతి కార్మికులు 10% ఉన్నారు. అంతకుముందు సంవత్సరం ఇది 8.7 శాతంగా ఉండేది. ఇక లాటిన్‌ అమెరికన్‌ల నిష్క్రమణలు 8% నుండి 9.8 శాతానికి పెరిగాయి. ఇక పురుషులు, ఆసియన్‌ ఉద్యోగుల విషయానికి వస్తే ఇది విరుద్ధంగా ఉంది. 2023లో కంటే గతేడాది వీరి నిష్క్రమణలు తక్కువగా నమోదయ్యాయి.

ఇదీ చదవండి: ఐటీ పరిశ్రమలో చాన్నాళ్లకు మారిన పరిస్థితులు

ప్రత్యర్థి కంపెనీలు అవలంభిస్తున్న పోకడలే ఇందుకు కారణంగా మైక్రోసాఫ్ట్‌ పేర్కొంటోంది. అలాగే తమ భౌతిక, ఆన్‌లైన్ రిటైల్ వ్యాపారాలలో మార్పులు కూడా కొంత మేరకు కారణమైన ఉండచ్చొని చెబుతోంది. పెద్దగా ప్రాతినిధ్యం లేని సమూహాల నుండి ఉద్యోగులను నియమించుకోవడాన్ని మైక్రోసాఫ్ట్ ఎప్పుడూ కొనసాగిస్తోందని, అయితే వారిని నిలుపుకోవడానికి మరింత చేయాల్సి ఉందని మైక్రోసాఫ్ట్ చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్ లిండ్సే-రే మెక్‌ఇంటైర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)