Breaking News

మైక్రోసాఫ్ట్‌లో మరోమారు లేఆఫ్స్!.. ఎఫెక్ట్ వారిపైనే..

Published on Fri, 04/11/2025 - 07:44

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. మరోమారు ఉద్యోగులను తొలగించడానికి సన్నద్ధమవుతోంది. ప్రాజెక్ట్ బృందాలలో ఇంజనీర్ల నిష్పత్తిని పెంచే ప్రయత్నంలో భాగంగా ఈ కోతలు ఉంటాయి. ఈ ప్రభావం వల్ల ప్రధానంగా మిడిల్ మేనేజ్‌మెంట్, నాన్-టెక్నికల్ ఉద్యోగులు ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. మే నెలలో ఈ లేఆప్స్ ఉండే అవకాశం ఉంది. ఎయితే ఈ ఎఫెక్ట్ ఎంతమందిపై ప్రభావం చూపుతుందని విషయం అధికారికంగా వెల్లడికాలేదు.

అమెజాన్, గూగుల్ కంపెనీల మాదిరిగానే.. మైక్రోసాఫ్ట్ కూడా నిర్వాహక పాత్రల కంటే సాంకేతిక ప్రతిభకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ లేఆప్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఆదాయ, వ్యయాలను సమతుల్యం చేయడమే లక్ష్యంగా మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకుంది.

మైక్రోసాఫ్ట్ గతంలో కూడా.. తక్కువ పనితీరు కనపరచిన 2,000 మంది ఉద్యోగులను తొలగించింది. దీన్ని బట్టి చూస్తుంటే.. త్వరలో జరగనున్న ఉద్యోగాల తొలగింపు ప్రభావం కూడా పనితీరు తక్కువగా ఉన్న ఉద్యోగుల మీదనే పడే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. దీనికి సంబంధించిన విషయాలు త్వరలోనే అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

ఏఐలో శిక్షణ
భవిష్యత్ ఆవిష్కరణలలో ఏఐ కీలకం. కాబట్టి 2030 నాటికి 10 మిలియన్ల (కోటి మందికి) మందికి ఏఐలో శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని గూగుల్ సీఈఓ సత్యనాదెళ్ళ గతంలోనే వివరించారు. ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధిపత్యం చెలాయిస్తోంది. దీనిని మరింత అభివృద్ధి చేయడానికి, తమ ఉద్యోగులకు కూడా ఇందులో శిక్షణ ఇవ్వడానికి దిగ్గజ సంస్థలు సన్నద్ధమవుతున్నాయి.

ఇదీ చదవండి: వ్యభిచార గృహాలతో సంబంధాలు:.. అమెరికాలో భారత సంతతి సీఈఓ అరెస్ట్‌

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు