Breaking News

ఆఫీసులో ఐఫోన్ మాత్రమే వాడండి!.. మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం

Published on Tue, 07/09/2024 - 16:55

ప్రముఖ టెక్ దిగ్గజం 'మైక్రోసాఫ్ట్' మొబైల్ వాడకంపై కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీలో పనిచేసే ఉద్యోగులు తప్పకుండా ఐఫోన్స్ మాత్రమే ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది. చైనాలోని కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైనా ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉపయోగిస్తున్న వారికి ఐఫోన్‌లను అందించడం ప్రారంభించినట్లు సమాచారం. చైనాలోని ఉద్యోగులందరూ సెప్టెంబర్ నుంచి ఆపిల్ ఐఫోన్స్ తప్పనిసరిగా ఉపయోగించాలని సంస్థ స్పష్టం చేసింది.

చైనాలో గూగుల్, గూగుల్ ప్లే సేవలు లేదు. ఆ దేశం మొబైల్ బ్రాండ్స్ అన్నీ సొంత ప్లాట్‌ఫామ్‌ కలిగి ఉన్నాయి. కాబట్టి అలాంటి మొబైల్స్ ఉపయోగించడం వల్ల కంపెనీ డేటాకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అయితే యాపిల్ ఐఫోన్‌లలో సెక్యూరీటీ సిస్టం పటిష్టంగా ఉంటుంది. కాబట్టి డేటా బయటకు వెళ్లే అవకాశం లేదు. ఈ కారణంగానే మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

చైనాలో మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ పాస్‌వర్డ్ మేనేజర్, ఐడెంటిటీ పాస్ యాప్‌ను ఉపయోగించాలని కంపెనీ పేర్కొంది. ఇవి యాపిల్, గూగుల్ ప్లే స్టోర్‌లలో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఉద్యోగులు తప్పకుండా ఆండ్రాయిడ్ ఫోన్స్ వదిలిపెట్టి.. ఐఫోన్ ఉపయోగించాలని కోరింది.

ఐఫోన్ లేని, ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్న ఉద్యోగులకు కంపెనీ కొత్త డివైజ్‌లను అందజేస్తుంది. ఉద్యోగులకు కొత్త ఐఫోన్ 15 ఇవ్వనున్నట్లు పేర్కొంది. అయితే కంపెనీ ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడొద్దని, కేవలం ఐఫోన్స్ మాత్రమే వాడండి అని చెప్పడంతో కొందరిలో అనుమానాలు పుడుతున్నాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)