Breaking News

నాడు బీభత్సం.. నేడు ఫెయిల్‌.. ఇకపై ఆ సేవలకు మైక్రోసాఫ్ట్‌ గుడ్‌బై?

Published on Fri, 02/28/2025 - 21:27

ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ (microsoft) కీలక నిర్ణయం తీసుకోనుంది. 2000 దశకంలో సంచలనం సృష్టించిన వీడియో కాలింగ్ ప్లాట్‌ఫామ్ స్కైప్‌కు (skype) స్వస్తి పలకనుంది. వెలుగులోకి వచ్చిన పలు అంతర్జాతీయ  మీడియా కథనాల ప్రకారం ఈ ఏడాది మే నెలలో స్కైప్‌ను షట్‌ డౌన్‌ చేసేందుకు మైక్రోసాఫ్ట్‌ సిద్ధమైనట్లు  తెలుస్తోంది.

ప్రముఖ టెక్‌ బ్లాగ్‌ ఎక్స్‌డీఏ కథ మేరకు..‘స్కైప్‌ ప్రివ్యూలో ఓ హిడెన్ మెసేజ్ కనిపించింది. అందులో, మే నెల నుంచి స్కైప్‌ అందుబాటులో ఉండదు. మీ కాల్స్, చాట్స్ చేసుకునేందుకు వీలుగా మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ ఉంది. అంతేకాదు, మీ మిత్రులు ఇప్పటికే టీమ్స్‌కి మారారు’ అని ఉన్నట్లు పేర్కొంది. అయితే,స్కైప్‌ షట్‌ డౌన్‌పై మైక్రోసాప్ట్‌ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.  

Screenshot 2025-02-27 191809

స్కైప్‌ చరిత్ర
స్కైప్‌  తొలిసారిగా 2003లో ప్రారంభమైంది. అతి తక్కువ సమయంలోనే ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించింది. అందుకే, 2011లో మైక్రోసాఫ్ట్ దీనిని 8.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. స్కైప్‌కి పోటీగా ఐమెసేజ్‌,వాట్సాప్‌,జూమ్‌ వంటి యాప్స్‌ పుట్టుకొచ్చాయి. దీంతో స్కైప్‌ ప్రాచుర్యం తగ్గిపోయింది. కోవిడ్‌-19 సమయంలో స్కైప్‌ మళ్లీ పాపులర్ అవుతుందనుకున్నారు. కానీ జూమ్‌, గూగుల్‌ మీట్స్‌ స్థాయిలో స్కైప్‌ ఆకట్టుకోలేకపోయింది. అందుకే స్కైప్‌ను మైక్రోసాఫ్ట్‌ షట్‌డౌన్‌ చేయనుందని వెలుగులోకి వచ్చిన మీడియా కథనాలు పేర్కొన్నాయి.స్కైప్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ (Microsoft Teams) అనే వీడియో ఫ్లాట్‌ఫారమ్‌ను వినియోగంలోకి తెచ్చింది.

టీమ్స్‌పై ఫోకస్‌ 
స్కైప్‌ను షట్‌డౌన్‌ చేయాలనే ఆలోచనలో ఉన్న మైక్రోసాఫ్ట్‌ తన ఫోకస్‌ అంతా మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌పై పెట్టింది.స్కైప్‌ కంటే ఎక్కువ ఫీచర్లను మైక్రోసాఫ్ట్‌టీమ్స్‌లో జోడించింది. ఇటీవల కోపైలెట్‌ ఏఐ ఫీచర్లను జోడించింది. ఇలా మైక్రోసాఫ్ట్‌ స్కైప్‌ను పూర్తిగా నిలిపివేస్తోందా? లేక వేరే రూపంలో తెరపైకి తెస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. 

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)