Breaking News

ఆదాయాల అంతరం.. ఆప్యాయతలు దూరం!

Published on Mon, 06/01/2026 - 14:25

సాఫ్ట్‌వేర్ రంగంలో భారీ ప్యాకేజీలు, విలాసవంతమైన జీవనశైలి ఒకవైపు ఆకర్షిస్తున్నా.. అంతర్గతంగా ఐటీ ఉద్యోగుల వ్యక్తిగత జీవితాల్లో కొత్త రకమైన ఆర్థిక విబేధాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ సంస్థలో పనిచేస్తున్న ఒక సీనియర్ ప్రొడక్ట్ డిజైనర్ తన భాగస్వామితో ఎదుర్కొంటున్న ‘ఆదాయ అసమానత’కు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. కలిసి జీవించడం సులువే అయినా నెలవారీ ఖర్చులు, జీతాల మధ్య ఉండే భారీ వ్యత్యాసం వారి మధ్య ఉన్న ప్రేమను ఎలా దూరం చేస్తోందో సదరు టెక్కీ ఆవేదన వ్యక్తం చేశాడు.

కార్పొరేట్ ఉద్యోగుల ప్రొఫెషనల్ కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్ ‘గ్రేప్‌వైన్‌’లో ఒక మైక్రోసాఫ్ట్ టెక్కీ ‘గూఫీపాండా’ అనే పేరుతో తన వ్యక్తిగత జీవితంలోని అంశాలను పంచుకున్నాడు. అందులోని వివరాల ప్రకారం.. ‘నేను మైక్రోసాఫ్ట్‌లో సీనియర్ ప్రొడక్ట్ డిజైనర్‌గా పనిచేస్తూ ఏడాదికి రూ.48 లక్షలు సంపాదిస్తున్నాను. నా స్నేహితురాలి వార్షిక ఆదాయం రూ.8 లక్షలు. ఈ ఏడాది ప్రారంభంలో మేమిద్దరం కలిసి ఉండాలని(లివ్‌-ఇన్‌ రిలేషన్‌షిప్‌) నిర్ణయించుకున్నాం. నా ఆఫీస్‌కు దగ్గర్లోనే ఒక మంచి ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాం. మొదట్లో అంతా సజావుగానే సాగింది. కానీ బడ్జెట్ దగ్గరకు వచ్చేసరికి అసలు కథ మొదలైంది’ అని పేర్కొన్నాడు.

ప్లాట్‌ లీజు ఒప్పందంపై సంతకాలు చేసి కొత్త ఇంట్లోకి మారిన తర్వాత నిత్యం వచ్చే బిల్లులు, కిరాణా ఖర్చులు, భారీ సెక్యూరిటీ డిపాజిట్ వంటివి వారి ఆర్థిక స్థితిగతుల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపించాయి. ఇద్దరి జీతాల మధ్య ఏకంగా 6 రెట్లు తేడా ఉండటంతో ఖర్చులను సమానంగా పంచుకోవడం అసాధ్యంగా మారింది.

టెక్కీ తెలిపిన వివరాల ప్రకారం..

ప్రస్తుతం అద్దె, రోజువారీ జీవనశైలి ఖర్చులతో కూడిన ఉమ్మడి బడ్జెట్‌లో 85 శాతానికి పైగా అతడే ఒంటరిగా భరిస్తున్నట్లు చెప్పాడు. బంధం న్యాయంగా సాగాలనే ఉద్దేశంతో ఆఫీస్ సీనియర్లను సంప్రదించి ఒక జాయింట్ అకౌంట్ కూడా క్రియేట్ చేసినట్లు తెలిపాడు. అయినా సమస్య సర్దుమణగలేదన్నాడు.

కారు రిపేర్ బిల్లుతో..

ఈ ఏర్పాటు కొంతకాలం స్థిరంగా సాగినట్లు అనిపించినా ఊహించని ఖర్చులు ఎదురైనప్పుడు అసలు సమస్య తీవ్రరూపం దాల్చింది. ఇటీవల వారి కారు రిపేర్ బిల్లు వచ్చింది. ఈ ఖర్చును ఇద్దరం పంచుకుందామని అతను ప్రతిపాదించగా ఆమె ఆర్థికంగా ఆ విషయాన్ని పూర్తిగా దాటవేసేందుకు ప్రయత్నించినట్లు పోస్ట్‌లో తెలిపాడు. ‘డబ్బు విషయంలో జరిగే ప్రతి చిన్న గొడవ మా మధ్య ఉన్న ఆప్యాయతను, ప్రేమను క్రమంగా నాశనం చేస్తోంది. వ్యక్తిగత జీవితంలో నేను ఎదుర్కొన్న అత్యంత ఒత్తిడితో కూడిన పరిస్థితి ఇదే’ అని సదరు టెక్కీ ఆందోళన వ్యక్తం చేశాడు.

నెటిజన్ల అభిప్రాయాలు

ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలతో కామెంట్‌ చేస్తున్నారు. ‘ఆమెతో నీకు దీర్ఘకాలిక భవిష్యత్తు ఉంటుందని నమ్మకం ఉంటే ఆర్థిక భారాన్ని నువ్వే ఎక్కువగా మోయడంలో తప్పులేదు. ఆదాయ అసమానతలు సహజం. భాగస్వామి కెరీర్ ఎదగడానికి నువ్వే సాయం చేయాలి’ అని కొందరు చెబుతున్నారు. ‘ఆమెకు నీతో కలిసి జీవించాలనే నిబద్ధత ఉంటే.. అదనపు ఖర్చుల విషయంలో రక్షణాత్మకంగా ఎందుకు ప్రవర్తిస్తుంది? నువ్వు ఆమెను జీవిత భాగస్వామిగా చూస్తున్నావా లేక కేవలం రూమ్ మేట్‌లా భావిస్తున్నావా?’ అని కొందరంటున్నారు. 

నెటిజన్ల నుంచి వచ్చిన ఈ స్పందనపై సదరు మైక్రోసాఫ్ట్ ఉద్యోగి మళ్లీ స్పందించాడు. తాను ఆమెను కేవలం ఫ్లాట్ మేట్‌లా కాకుండా తన జీవిత భాగస్వామిగానే భావిస్తున్నానని స్పష్టం చేశాడు. అయితే, సాధారణ డేటింగ్ స్థాయి నుంచి ఒకే ఇంట్లో ఉంటూ సంసారాన్ని నిర్వహించే స్థాయికి మారే క్రమంలో ఎదురైన ఆర్థిక సవాళ్లు తను ఊహించలేదని అంగీకరించాడు. ‘త్వరలోనే మేమిద్దరం ప్రశాంతంగా కూర్చుని, దీర్ఘకాలంలో మా బంధం నిలబడటానికి తగ్గట్టుగా ఒక స్థిరమైన ఆర్థిక ప్రణాళికను రూపొందించుకుంటాం’ అని అతను ముగించాడు.

ఇదీ చదవండి: రైల్వే సూపర్ యాప్.. పాత యాప్‌ మధ్య తేడా ఏమిటి?

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)