Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ
Breaking News
ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వార్నింగ్!
Published on Fri, 04/08/2022 - 15:04
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చారు. పెరిగిపోతున్న పనిగంటలతో అర్ధరాత్రి వరకు మెలుకువతో ఉండడం వల్ల అనారోగ్య సమస్యలకు గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉద్యోగులు ఆ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
'వార్టన్ ఫ్యూచర్ ఆఫ్ వర్క్ కాన్ఫరెన్స్'లో సీఈఓ సత్య నాదెళ్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ వర్క్‌స్పేస్ 'మైక్రోసాఫ్ట్ టీమ్స్'పై రిమోట్ వర్క్ ఎలాంటి ప్రభావం చూపిందో గుర్తించామని తెలిపారు. అంతేకాదు మైక్రోసాఫ్ట్ రీసెర్చ్‌ను ఉదహరిస్తూ.. వైట్ కాలర్ ఉద్యోగుల్లో 3వ వంతు మంది అర్ధరాత్రి వరకు వర్క్ చేస్తున్నట్లు తెలిపారు. సాధారణంగా ప్రొడక్టివిటీ భోజనానికి ముందు, తర్వాత పెరుగుతుంది. కానీ ఈ 'ట్రిపుల్ పీక్ డే' రిమోట్ వర్క్ (అంటే అర్ధరాత్రి వరకు పనిచేయడం) మన ఇంటి జీవితాల్ని ఎలా విచ్ఛిన్నం చేసిందో వివరిస్తుందన్నారు. అందుకే సంస్థలు, ఉద్యోగులకు స్పష్టమైన సమయ పాలన పాటించేలా ఆదేశాలు జారీ చేయాలని అన్నారు. అలా చేస్తే ఉద్యోగులు మెయిల్స్ విషయంలో ఒత్తిడి గురువ్వరని చెప్పారు.
Microsoft CEO Satya Nadella warns that employee well-being could suffer from an ever-expanding workday that often now creeps well into the night https://t.co/JC7rCZWInI
— Bloomberg (@business) April 7, 2022
"మేం వర్క్ ప్రొడక్టివిటీని కొలాబరేషన్, అవుట్‌పుట్ ఆధారంగా పరిగణలోకి తీసుకుంటాం. అయితే ప్రొడక్టివిటీలో అత్యంత ముఖ్యమైన భాగాలలో ఉద్యోగుల శ్రేయస్సు ఒకటి" అని సత్యనాదెళ్ల చెప్పారు. ఒత్తిడి ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసు. అందుకే ఆ ఒత్తిడిని జయించేందుకు సాఫ్ట్ స్కిల్స్, ఓల్డ్ ఫ్యాషనేడ్ స్కీల్స్ ను(పాత కాలపు నిర్వహణ పద్ధతుల్ని) నేర్చుకోవాలి. ఇక వర్క్ మన వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రభావితం చూడకుండా ఉండాలంటే జాగ్రత్త వహించాలని ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ఉద్యోగులకు హితబోధ చేశారు.
చదవండి: దటీజ్ సత్య నాదెళ్ల.. సక్సెస్‌కి కారణాలివే!
Tags : 1