Breaking News

Michael D Patra: 2031 నాటికి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ

Published on Sat, 07/13/2024 - 04:55

ముంబై: భారత్‌ 2031 నాటికి ప్రంపచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ మైకేల్‌ డి పాత్ర పేర్కొన్నారు. 2060 నాటికి ప్రంపచ నంబర్‌ 1 ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్నారు. కాకపోతే ఈ దిశగా కొన్ని సవాళ్లను అధిగమించాల్సి ఉందన్నారు. కారి్మక ఉత్పాదకత, మౌలిక వసతులు, జీడీపీలో తయారీ రంగం వాటాను పెంచడం, ఆర్థిక వ్యవస్థను పర్యావరణం అనుకూలంగా మార్చడం తదితర సవాళ్లను ప్రస్తావించారు. 

ముస్సోరిలో ఐఏఎస్‌ అధికారులతో నిర్వహించిన సమావేశంలో భాగంగా పాత్ర మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌ ఏటా 9.6 శాతం చొప్పున దశాబ్ద కాలం పాటు వృద్ధిని సాధిస్తే దిగువ మధ్యాదాయ ఉచ్చు నుంచి బయట పడి, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించొచ్చని చెప్పారు. ‘‘4516–14005 డాలర్ల తలసరి ఆదాయ స్థాయి అన్నది మధ్యాదాయ దేశం హోదాకు సంబంధించినది. 

ఇది దాటితేనే అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ హోదాకు చేరుకుంటాం. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపునకు తలసరి ఆదాయ పరిమితి 34,000 డాలర్లకు చేరుకోవచ్చు’’అని పాత్ర పేర్కొన్నారు. కరెన్సీల విలువలు అస్థిరంగా ఉన్నాయంటూ.. దేశాల మధ్య పోలికకు ఇవి తగినవి కాదని పాత్ర అభిప్రాయపడ్డారు. దీనికి ప్రత్యామ్నాయ కొలమానం ‘కొనుగోలు శక్తి సమానత’ (పీపీపీ) అని చెప్పారు.  ఆర్థిక సహాకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) పీపీపీ ప్రకారం భారత్‌ 2048 నాటికి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నది చెప్పడం గమనార్హం.

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)