Breaking News

కేంద్రం కీలక నిర్ణయం: ఉపాధి హామీ పథకం పేరు మార్పు

Published on Fri, 12/12/2025 - 15:33

కేంద్ర కేబినెట్ ఉపాధి హామీ పథకం పేరును మారుస్తూ కీలక ప్రకటన చేసింది. 'పూజ్య బాపు ఉపాధి హామీ పథకం'గా నామకరణం చేయడంతో పాటు.. పనిదినాలు ఏడాదికి 120 రోజులకు పెంచింది.

ఈ పథకాన్ని మొదట జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 (NREGA) అని ప్రారంభించారు. తరువాత దీనిని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA)గా మార్చారు. ఇప్పుడు 'పూజ్య బాపు ఉపాధి హామీ పథకం'గా మారుస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో.. నైపుణ్యం లేని పౌరులకు జీవనోపాధిని, ఆర్ధిక భద్రతను  కల్పించడానికి కేంద్రం ఈ ఉపాధి హామీ పథకం ప్రారంభించింది. ఈ స్కీమ్ ప్రకారం..  ఇది వరకు ప్రతి ఇంటి  నుంచి పని చేయడానికి సిద్ధంగా ఉన్న పెద్దలకు కనీసం 100 రోజుల ఉపాధి కల్పించారు. అయితే ఇప్పుడు పనిదినాలు 120 రోజులకు పెంచారు.

గ్రామీణ ప్రాంతాల్లో పనికి డిమాండ్ పెరిగినప్పుడు.. ఈ పథకం చాలామందికి ఉపాధి కల్పించింది. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం, ఇంటికి దగ్గరగా సంపాదించుకోవడానికి అవకాశం కల్పించడం వంటివి ఈ పథకం ద్వారానే సాధ్యమైంది. ఈ పథకం కేవలం ఉపాధి కల్పనకే పరిమితం కాకుండా, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన & స్థిరమైన అభివృద్ధికి కూడా దోహదపడుతుంది.

ఇదీ చదవండి: అప్పు కోసం బ్యాంకుకు వెళితే మొట్టమొదట చూసేదేమిటి?

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)