Breaking News

అమ్మకాల్లో అదరగొట్టిన ఎంజీ మోటార్‌

Published on Fri, 07/21/2023 - 07:24

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్‌ ఇండియా 2023 జనవరి–జూన్‌లో దేశవ్యాప్తంగా 29,000 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 21 శాతం వృద్ధి సాధించినట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో రంగ ప్రవేశం చేసిన హెక్టర్‌ తదుపరి తరం వేరియంట్‌తోపాటు జడ్‌ఎస్‌ ఈవీకి భారీ డిమాండ్‌ ఈ వృద్ధికి దోహదం చేసిందని వెల్లడించింది. కంపెనీ నుంచి అత్యధికంగా 2023 మార్చిలో 6,051 యూనిట్లు రోడ్డెక్కాయి. 

ఎంజీ మోటార్‌ ఇండియా భారత్‌లో మరో ప్లాంటును ఏర్పాటు చేయాలని భావిస్తోంది. 1.8 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఇది రానుంది. గుజరాత్‌లోని హలోల్‌ వద్ద 1.2 లక్షల యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యంతో కంపెనీకి ఇప్పటికే ప్లాంటు ఉంది. జనరల్‌ మోటార్స్‌ నుంచి ఈ కేంద్రాన్ని కొనుగోలు చేసింది. 

హలోల్‌ ప్లాంటు వార్షిక సామర్థ్యాన్ని ఈ ఏడాది 1.5 లక్షల యూనిట్లను చేర్చనుంది. ఈ ప్లాంటు విస్తరణకు రూ.820 కోట్లు వెచ్చిస్తోంది. భారత్‌లో అయిదేళ్ల వ్యాపార ప్రణాళికలో భాగంగా ఎలక్ట్రిక్‌ వాహనాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ 4–5 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలని సంస్థ నిర్ణయించింది. 2028 నాటికి దేశంలో కార్యకలాపాల విస్తరణకు రూ.5,000 కోట్లు ఖర్చు చేస్తోంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)