Breaking News

మెట్రోలు, హిల్‌ స్టేషన్లకే మొగ్గు

Published on Sat, 07/15/2023 - 06:01

ముంబై: దేశీయంగా మెట్రో నగరాలు, హిల్‌స్టేషన్లతో కూడిన పర్యాటక ప్రదేశాల సందర్శనకు ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. ప్రస్తుత ఏడాది తొలి ఆరు నెలలపై ట్రావెల్‌ బుకింగ్‌ సేవలు అందించే ‘బుకింగ్‌ డాట్‌ కామ్‌’ నివేదిక విడుదల చేసింది. హైదరాబాద్, న్యూఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై, పుణె, మనాలీ, రిషికేశ్, వారసత్వ సంపదకు నిలయమైన జైపూర్‌ తదితర ప్రాంతాలను ఎక్కువ మంది సందర్శించేందుకు ఆసక్తి చూపించారు. అంతర్జాతీయంగా చూస్తే, దుబాయి, బ్యాంకాక్, లండన్, సింగపూర్, కౌలాలంపూర్, హోచిమిన్హ్, ప్యారిస్, హనోయ్‌ ప్రాంతాలను సందర్శించేందుకు భారత పర్యాటకులు ఎక్కువ మంది బుకింగ్‌ చేసుకున్నారు. హోటళ్లకు అదనంగా, రిసార్ట్‌లు, గెస్ట్‌ హౌస్‌లు, ఆతిథ్య గృహాలు పర్యాటకుల ప్రాధాన్యంగా ఉన్నాయి.  

ఈ దేశాల నుంచి ఎక్కువగా..
మొదటి ఆరు నెలల్లో యూఎస్, బంగ్లాదేశ్, రష్యా, యూఏఈని నుంచి ఎక్కువ మంది భారత్‌ను సందర్శించారు. అలాగే, విదేశీ పర్యాటకులు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు మెట్రోలను ఎక్కువగా చూశారు.  86 శాతం భారత పర్యాటకులు వచ్చే 12 నెలల్లో తమ పర్యటనల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారు. ‘‘స్థూల ఆర్థిక సమస్యలను పర్యాటక రంగం ఎదుర్కొంటున్నప్పటికీ, ఇటీవలి సంవత్సరాల్లో పర్యాటకం ఎంతో ఆదరణకు నోచుకుంటోంది. హోటళ్లే కాకుండా పర్యాటకులు ప్రత్యామ్నాయ ఆతిథ్యాలను కూడా ఎంపిక చేసుకుంటున్నారు’’అని బుకింగ్‌ డాట్‌ కామ్‌ కంట్రీ మేనేజర్‌ సంతోష్‌ కుమార్‌ తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)