Breaking News

అథ్లెట్ల కోసం మెటా ఏఐ గ్లాసెస్‌

Published on Mon, 06/23/2025 - 13:19

అథ్లెట్లు, క్రీడా ఔత్సాహికులను లక్ష్యంగా చేసుకుని మెటా కొత్త తరం ఏఐ గ్లాసెస్‌ను పరిచయం చేయడానికి ఓక్లేతో జతకట్టింది. ఓక్లే మెటా హెచ్ఎస్‌టీఎన్‌ అని పిలువబడే ఈ గ్లాసెస్‌తో మెటా అధునాతన సాంకేతికతను వాడినట్లు తెలిపింది. ఈ గ్లాసెస్‌లోని ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.  

  • 3కే అల్ట్రా హెచ్డీ కెమెరా.. 12 మెగాపిక్సెల్ కెమెరాతో హై రిజల్యూషన్, పాయింట్ ఆఫ్ వ్యూ వీడియోలు, ఫొటోలను క్యాప్చర్ చేస్తుంది.

  • మెటా ఏఐ ఇంటిగ్రేషన్.. రియల్ టైమ్ సమాచారాన్ని పొందడానికి, మ్యూజిక్‌ను నియంత్రించడానికి, వెదర్‌ను తనిఖీ చేయడానికి లేదా ల్యాంగ్వేజ్‌లను ట్రాన్స్‌లేట్‌ చేయడానికి ‘హే మెటా’ ‍అనే వాయిస్‌ కమాండ్‌ ఉపయోగించవచ్చు.

  • ఓపెన్-ఇయర్ ఆడియో.. ఈ గ్లాసెస్‌లో బిల్ట్ ఇన్ స్పీకర్లు ఉండడంతో ఎలాంటి ఇయర్‌ ఫోన్లు లేకుండానే మ్యూజిక్‌ వినవచ్చు.

  • నీరు, ధూళి నిరోధకత కోసం ఐపీఎక్స్ 4-రేటింగ్‌తో అవుట్ డోర్ క్రీడలకు ఎంతో అనువైందని కంపెనీ తెలిపింది.

  • బ్యాటరీ లైఫ్.. 8 గంటల వరకు యాక్టివ్ యూజ్, 19 గంటల స్టాండ్ బై ఉంటుంది. 20 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ ఛార్జ్‌ అవుతుంది. చార్జింగ్‌ కేస్‌ ద్వారా మరో 48 గంటలు అదనంగా ఛార్జింగ్‌ ఉంటుంది.

  • ఈ లిమిటెడ్ ఎడిషన్ ఓక్లే మెటా హెచ్ఎస్‌టీఎన్‌ ధర 499 డాలర్లు (సుమారు రూ.43,200)గా నిర్ణయించారు. ప్రీ-ఆర్డర్లు జులై 11 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది.

ఇదీ చదవండి: పుత్తడి ప్రియులకు స్వల్ప ఊరట

ప్రాథమికంగా యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ గ్లాసెస్‌ అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది. ఇండియా, మెక్సికో, యూఏఈతో ఈ సంవత్సరం చివరలో అందుబాటులోకి తేనున్నట్లు చెప్పింది.

#

Tags : 1

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)