Breaking News

మెటా ఏఐ గ్లాసెస్‌.. ప్రత్యేకతలివే..

Published on Sat, 03/15/2025 - 13:46

సోషల్‌ మీడియా దిగ్గజం మెటా తమ నెక్ట్స్‌–జెనరేషన్‌ గ్లాసెస్‌ అరియ జెన్‌ 2 గురించి ప్రకటించింది. ‘అరియ జెన్‌2 గ్లాసెస్‌కు సంబంధించి మా ప్రయాణంలో తదుపరి దశ గురించి ప్రకటించడానికి సంతోషిస్తున్నాం. మెషిన్‌ పర్సెప్షన్, కంటెక్ట్స్‌వల్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్‌తో సహా పరిశోధన రంగాలలో కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది’ అని మెటా తన బ్లాగ్‌ పోస్ట్‌లో పేర్కొంది.

మెటా అరియా జెన్ 2 స్మార్ట్ గ్లాసెస్ ప్రధానంగా పరిశోధకులు, డెవలపర్ల కోసం రూపొందించిన అత్యాధునిక ఆవిష్కరణ అని కంపెనీ పేర్కొంది. అధునాత వియరబుల్‌ టెక్నాలజీ(ధరించేందుకు వీలుగా ఉన్న వస్తువుల్లో వాడే టెక్నాలజీ) ఫీచర్లతో ఈ అద్దాలు మార్కెట్‌లోకి వస్తున్నట్లు స్పష్టం చేసింది.

కీలక ఫీచర్లు ఇవే..

అధునాతన సెన్సర్లు: హార్ట్ రేట్ మానిటర్, స్పేషియల్ మైక్రోఫోన్లతో పాటు ఐ-ట్రాకింగ్, హ్యాండ్ ట్రాకింగ్, మోషన్ సెన్సార్లను కలిగి ఉంటుంది.

కృత్రిమమేధ: ఇంటర్నెట్ కనెక్టివిటీపై ఆధారపడకుండా స్పీచ్ రికగ్నిషన్, ఆబ్జెక్ట్ డిటెక్షన్ వంటి వేగవంతమైన, సమర్థవంతమైన కార్యాచరణలను ప్రాసెస్‌ చేసి వినియోగదారులకు డేటాను అందిస్తుంది.

బ్యాటరీ లైఫ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 6-8 గంటల ఉపయోగించవచ్చని కంపెనీ పేర్కొంది. ఇది పరిశోధన కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుంది.

తేలికపాటి డిజైన్: ఈ గ్లాసెస్‌ బరువు కేవలం 75 గ్రాములేనని కంపెనీ తెలిపింది.

ఇదీ చదవండి: మార్చి 17 వరకు ఇంటర్నెట్‌ సేవలు బంద్‌

ఈ గ్లాస్‌ల వినియోగానికి సంబంధించి మెటా తెలిపిన వివరాల ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ పరిశోధనలో వీటిని ఉపయోగించవచ్చు. దృష్టి లోపం ఉన్న వ్యక్తులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. రియల్‌టైమ్‌లో వస్తువులను, మన ముందుతున్న పరిస్థితులను ట్రాక్‌ చేసి డేటాను అందిస్తుంది. 
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)