Breaking News

‘బాధను అంగీకరించి ముందుకు సాగుతున్నా’

Published on Sat, 03/22/2025 - 10:26

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ నుంచి మెలిందా గేట్స్‌(Melinda Gates) విడాకులు తీసుకున్న మూడేళ్ల తర్వాత తన మాజీ భర్త ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఎల్లే మ్యాగజైన్‌తో మాట్లాడిన 60 ఏళ్ల మెలిందా గేట్స్‌ తాము విడిపోవడం వల్ల కలిగిన బాధను అంగీకరించి ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ‘విడాకులు బాధాకరమైనవి. ఇవి ఏ కుటుంబంలో ఉండకూడదనే నేను కోరుకుంటున్నాను’ అని అన్నారు.

మెలిందా, బిల్ గేట్స్ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ 2021 మేలో విడాకులు తీసుకున్నారు. తర్వాత మూడు నెలలకు అధికారికంగా వీరు విడిపోయారు. ఇటీవల తమ బ్రేకప్‌పై బిల్‌గేట్స్‌ టైమ్స్ ఆఫ్ లండన్‌తో మాట్లాడుతూ.. విడాకుల వ్యవహారం తనకు, మెలిందాకు కనీసం రెండేళ్ల పాటు బాధను మిగిల్చిందని అన్నారు. తన జీవితంలో అతిపెద్ద తప్పిదమని తమ విడాకులేనన్నారు. తాను ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని నెలల తర్వాత మెలిందా తాజాగా స్పందించడం గమనార్హం. తాము విడిపోవడం వల్ల కలిగిన బాధను అంగీకరించి ముందుకు సాగుతున్నట్లు మెలిందా తెలిపారు. విడాకులు బాధాకరమైనవని చెప్పారు. ఇవి ఏ కుటుంబంలో ఉండకూడదనే కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. విడా​కులు తీసుకోవాలనే నిర్ణయం కష్టమైనప్పటికీ జీవితాన్ని స్వతంత్రంగా పునర్నిర్మించగల సామర్థ్యం తనకు ఉందని ఆమె అన్నారు.

ఇదీ చదవండి: ప్రముఖ బ్రాండ్‌ ప్రచారకర్తలుగా మహేష్‌, సితార

2021లో బిల్‌గేట్స్‌..మిలిండా గేట్స్ 27 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్‌బై చెప్పారు. అదే ఏడాది తాము విడిపోతున్న‌ట్లు ప్రకటించారు. అనంతరం వాషింగ్ట‌న్‌లోని కింగ్ కౌంటీ కోర్టులో మిలిందా గేట్స్ విడాకుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. 1987లో మైక్రోసాఫ్ట్ సంస్థ ఏర్పాటు స‌మ‌యంలో ఇద్ద‌రూ క‌లుసుకున్నారు. 1994లో వాళ్లిద్ద‌రు పెళ్లి చేసుకున్నారు. కేవ‌లం విడిపోయే అంశంలో కుదుర్చుకున్న కాంట్రాక్ట్‌ ఆధారంగా డైవ‌ర్స్ తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక, మిలిందా గేట్స్‌ నుంచి విడిపోయిన బిల్‌ గేట్స్‌ పౌలా హార్డ్‌తో సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)