Breaking News

అనలాగ్‌ ఏఐతో ‘మేఘ’ జట్టు

Published on Thu, 07/02/2026 - 04:09

సాక్షి, బిజినెస్‌ ప్రతినిధి; ఇన్‌ఫ్రా రంగ దిగ్గజం ‘మేఘ ఇంజనీరింగ్‌ (ఎంఈఐఎల్‌)’ ‘ఏఐ’లోకి ఎంట్రీ ఇచ్చింది.  అబుదాబి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఫిజికల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ‘అనలాగ్‌ ఏఐ’తో కలిసి కొత్త భాగస్వామ్య సంస్థను ఏర్పాటు చేసింది. ఈ జేవీలో ఇద్దరికీ చెరో 50 శాతం వాటా ఉంటుందని మేఘ సంస్థ ఎండీ పి.వి.కృష్ణారెడ్డి వెల్లడించారు. బుధవారమిక్కడ అనలాగ్‌ సీఈఓ అలెక్స్‌ కిప్‌మాన్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే రెండు మూడేళ్లలో తాము ఈ జేవీలో రూ.3,000 కోట్ల నుంచి 4,500 కోట్ల వరకూ పెట్టుబడి పెడతామని, అనలాగ్‌ భారత కార్యకలాపాలను పూర్తిగా ఈ జేవీయే చూస్తుందని చెప్పారాయన. కొత్త కంపెనీ పేరు, లోగో తదితర వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా అలెక్స్‌ కిప్‌మాన్‌ చెప్పారు.  

ఫిజికల్‌ ఏఐ... అవకాశాలు అపారం 
మూడేళ్ల కిందట అబుదాబి టెక్నాలజీ దిగ్గజం జీ24తో కలిసి అలెక్స్‌ కిప్‌మాన్‌ అనలాగ్‌ ఏఐని ఆరంభించారు. ఇది ప్రశ్నలకు టెక్ట్స్‌ రూపంలో సమాధానాలు చెప్పే ఫౌండేషనల్‌ ఏఐ కాదు. ఫిజికల్‌ ఏఐ. యంత్రాలు, పవర్‌ ప్రాజెక్టులు, వాహనాలు సహా భౌతిక వస్తువుల్ని సెన్సర్లతో అనుసంధానించి వాటి డిజిటల్‌ ట్విన్స్‌ను తయారు చేస్తుంది. వాటి సాయంతో దూరంగా ఉండికూడా వీటిని పర్యవేక్షించొచ్చు. యంత్రాల సామర్థ్యం పెరగటంతో పాటు ప్రమాదాల నివారణ, మెయింటెనెన్స్‌ అవసరాల్ని ముందే తెలుసుకోవచ్చు. స్మార్ట్‌ సిటీల్లో వాటర్‌ ఫ్లోను, ట్రాఫిక్‌ను సైతం దీనిద్వారా సమర్థంగా నిర్వహించవచ్చు.

ఇలా చాలా ప్రయోజనాలుండటం వల్ల భారత్‌లో దీనికి అపార అవకాశాలున్నాయని కృష్ణారెడ్డి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘ఇది అత్యాధునిక టెక్నాలజీ. రిఫైనరీలతో సహా అన్నిచోట్లా వినియోగించొచ్చు. మా గ్రూపు సంస్థ ఒలెక్ట్రా త్వరలో బ్యాటరీ తయారీ, ప్యాసింజర్‌ కార్ల తయారీలోకి ప్రవేశిస్తోంది. దానిక్కూడా అనలాగ్‌ ఫిజికల్‌ ఇంటెలిజెన్స్‌ పనికొస్తుంది’ అని స్పష్టంచేశారు. ఈ జేవీ భారతదేశమంతటా సేవలందిస్తుందని, ఒక్క ఎంఈఐఎల్‌కే కాదని, ఇప్పటికే తమకు చాలామంది క్లయింట్లున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా కిప్‌మాన్‌ చెప్పారు.  అబుదాబిలో చాలాచోట్ల  దీన్ని  వాడుతున్నారని, డేటా సెంటర్లు, పవర్‌ ప్రాజెక్టుల్లోనూ మోహరించామని చెప్పారాయన.

హైదరాబాద్‌లో డెవలప్‌మెంట్‌ సెంటర్‌ 
తమ భాగస్వామ్య సంస్థ సారథ్యంలో హైదరాబాద్‌లో ఇండియా డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను త్వరలో ఏర్పాటు చేస్తామని కిప్‌మాన్‌ చెప్పారు. ఉద్యోగుల సంఖ్య మొదట్లో తక్కువే ఉంటుందని, మెల్లగా విస్తరిస్తూ వెళతామని తెలియజేశారు. వచ్చే 3 నెలల్లో తమ భారత సేవలు వాణిజ్యపరంగా మొదలవుతాయని, పైలట్‌ ప్రాజెక్టులు ఇప్పటికే కొనసాగుతున్నాయని చెప్పారాయన. కార్యక్రమంలో మేఘ సంస్థ డైరెక్టర్లు పి.వి.ప్రణవ్‌ రెడ్డి, మానస్‌ రెడ్డి, అనలాగ్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ యెన్సీ స్మిత్‌ పాల్గొన్నారు.

#

Tags : 1

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)