Breaking News

అప్పుడు పరీక్షలో ఫెయిల్.. ఇప్పుడు గూగుల్‌లో జాబ్: జీతం తెలిస్తే..

Published on Mon, 12/23/2024 - 11:43

జీవితంలో అనుకున్నది సాధించాలంటే.. అసాధారణమైన సంకల్పం, పట్టుదల అవసరం. అప్పుడే సక్సెస్ సాధించవచ్చు. దీనికి బీహార్‌కు చెందిన 'పుష్పేంద్ర కుమార్' ప్రయాణమే నిదర్శనం. ఇంతకీ ఇతనెవరు? ఏం సాధించారు అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

బీహార్‌లోని జాముయి జిల్లా ఝఝా బ్లాక్‌లోని బుధిఖండ్ గ్రామానికి చెందిన హరిఓమ్ శరణ్ పెద్ద కుమారుడు పుష్పేంద్ర కుమార్..  ప్రపంచంలోని ప్రముఖ టెక్ కంపెనీలలో ఒకటైన గూగుల్‌లో అధిక వేతనంతో కూడిన ఉద్యోగం సంపాదించాడు.

ఓ చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన పుష్పేంద్ర.. గూగుల్ కంపెనీలో చేయాలని కల కన్నాడు. ప్రస్తుతం ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుతున్న ఇతడు తన కోర్సు పూర్తి చేయడానికి ముందే గూగుల్‌లో డేటా సైంటిస్ట్‌గా ఎంపికయ్యాడు. కొడుకు కల నెరవేరినందుకు అతని కుటుంబ సభ్యులందరూ ఆనందంలో మునిగిపోయారు.

స్నేహితుల స్ఫూర్తితో..
పుష్పేంద్ర తన ప్రాథమిక విద్యను జార్ఖండ్‌లోని జసిదిహ్‌లో పూర్తి చేశాడు. 2018లో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తరువాత స్నేహితుల ప్రేరణతోనే ఐఐటీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (IIT-JEE)కి హాజరయ్యాడు. మొదటి ప్రయత్నంలో ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. అయినా.. పట్టు వదలకుండా మళ్ళీ సన్నద్దమయ్యాడు. దీంతో రెండో ప్రయత్నంలో విజయం సాధించాడు.

రూ.39 లక్షల ప్యాకేజీ
గూగుల్‌లో డేటా సైంటిస్ట్‌గా ఎంపికైన పుష్పేంద్ర ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఉద్యోగానికి ఎంపికైన రోజు నా జీవితంలోనే అత్యంత సంతోషకరమైన రోజు అని పేర్కొన్నాడు. మొదట భారతదేశంలోని గూగుల్‌లో పని చేస్తానని, అక్కడ అతనికి రూ.39 లక్షల ప్యాకేజీని ఆఫర్ చేసినట్లు పేర్కొన్నాడు. భవిష్యత్తులో కంపెనీ తనను విదేశాలకు పంపితే, తన ప్యాకేజీ భారత్‌లో పొందే దానికంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)