Breaking News

ఐపీవోకు మీషో రెడీ

Published on Fri, 07/04/2025 - 08:38

ఫ్యాషన్, బ్యూటీ, ఎల్రక్టానిక్స్‌ ప్రొడక్టుల ఈకామర్స్‌ కంపెనీ మీషో పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది. సాఫ్ట్‌బ్యాంక్‌కు పెట్టుబడులున్న కంపెనీ గోప్యతా విధానంలో ముందస్తు ఫైలింగ్‌ను చేపట్టినట్లు తెలుస్తోంది. గత నెల 25న అసాధారణ సమావేశం(ఈజీఎం)లో ఐపీవోకు ప్రాస్పెక్టస్‌ దాఖలుపై నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. లిస్టింగ్‌ ద్వారా కనీసం రూ. 4,250 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశాయి.


స్టాక్‌బ్రోకర్‌గా వన్‌ మొబిక్విక్‌

సెబీ నుంచి గ్రీన్‌సిగ్నల్‌

స్టాక్‌ బ్రోకర్, క్లియరింగ్‌ సభ్యులుగా వ్యవహరించేందుకు పూర్తి అనుబంధ సంస్థ మొబిక్విక్‌ సెక్యూరిటీస్‌ బ్రోకింగ్‌ (ఎంఎస్‌బీపీఎల్‌)కు అనుమతి లభించినట్లు మాతృ సంస్థ వన్‌ మొబిక్విక్‌ సిస్టమ్స్‌ తాజాగా వెల్లడించింది. ఇందుకు నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు పేర్కొంది. 2025 జులై1న సెబీ నుంచి రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ జారీ అయినట్లు తెలియజేసింది. వెరసి ఎంఎస్‌బీపీఎల్‌ దేశీ స్టాక్‌ బ్రోకర్‌గా కొనుగోళ్లు, అమ్మకాలు, లావాదేవీలు, క్లియరింగ్, ఈక్విటీ లావాదేవీల సెటిల్‌మెంట్లు చేపట్టనున్నట్లు వివరించింది.

ఇదీ చదవండి: బ్యాంకు ఖాతా తెరిచేందుకు ఆధార్‌ తప్పనిసరి కాదు

తాజా లైసెన్స్‌ కారణంగా క్యాపిటల్‌ మార్కెట్లో సంపద పంపిణీ(వెల్త్‌ డి్రస్టిబ్యూషన్‌) విభాగంలో సేవలు మరింత విస్తరించేందుకు వీలుంటుందని తెలియజేసింది. తద్వారా సమీకృత ఫిన్‌టెక్‌ సంస్థగా అవతరించనున్నట్లు పేర్కొంది. మొబిక్విక్‌ గ్రూప్‌ అనుబంధ సంస్థ జాక్‌ ఈపేమెంట్‌ సర్వీసెస్‌(జాక్‌పే).. ఆన్‌లైన్‌ పేమెంట్‌ అగ్రిగేటర్‌గా సేవలందించేందుకు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆర్‌బీఐ నుంచి అనుమతి పొందిన సంగతి తెలిసిందే.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)