Breaking News

రియల్టీలో రూ.700 కోట్లతో కొత్త ఏఐఎఫ్‌ ప్రారంభం

Published on Mon, 06/02/2025 - 21:16

రియల్టీ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్న మీనాక్షి ఆల్టర్నేటివ్స్ (ఎం-ఆల్ట్స్) రూ.700 కోట్ల ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి (ఏఐఎఫ్) ‘మీనాక్షి రియల్‌ అసెట్స్‌ ఫండ్స్‌’ను ప్రారంభించినట్లు తెలిపింది. రియల్ ఎస్టేట్, క్లీన్ ఎనర్జీలో బలమైన పట్టున్న మీనాక్షి గ్రూప్‌నకు కొత్తగా ప్రారంభించిన ఫైనాన్షియల్ సర్వీసెస్ సబ్సిడరీగా ఈ ఫండ్ పెట్టుబడి వ్యూహాలు అందిస్తోందని, వినూత్న ఫైనాన్సింగ్ మోడళ్లను తీసుకువస్తుందని భావిస్తున్నారు.

ఏఐఎఫ్‌ ద్వారా తాజాగా మీనాక్షి గ్రూప్‌ రూ.700 కోట్ల పెట్టుబడులు పెడుతుండడం దేశీయ వాణిజ్య, నివాస స్థిరాస్తి మార్కెట్‌పై పెరుగుతున్న నమ్మకాన్ని హైలైట్‌ చేస్తుంది. గత పదేళ్ల నుంచి ఏఐఎఫ్‌లు పట్టు సాధిస్తున్నాయి. ఇవి సంస్థాగత, అధిక నికర విలువ కలిగిన పెట్టుబడిదారులను సాంప్రదాయ పెట్టుబడి మార్గాలకు మించి వారి పోర్ట్‌ఫోలియోలను వైవిధ్యపరుస్తున్నాయి. మీనాక్షి రియల్ అసెట్స్ ఫండ్ దేశంలో అభివృద్ధి చెందుతున్న పట్టణ మౌలిక సదుపాయాలు, ఆర్థిక విస్తరణకు అనుగుణంగా నిర్మాణాత్మక పెట్టుబడి అవకాశాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది. అందుకు స్థిరాస్తి రంగాన్ని ఎంచుకోవడం వృద్ధికి బాసటగా నిలుస్తుందని నమ్ముతుంది.

ఈ ఫండ్‌ సెబీ ఆమోదించిన కేటగిరీ-2 ఏఐఎఫ్ డెట్, ఈక్విటీ పెట్టుబడులను సమతుల్యం చేస్తూ హైబ్రిడ్ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజీని అనుసరిస్తుంది. మొత్తం రూ.700 కోట్ల కార్పస్‌తో ఆరేళ్ల ఇన్వెస్ట్‌మెంట్‌ విభాగంలో రియల్ ఎస్టేట్ డీల్స్ ద్వారా రాబడులను ఆప్టిమైజ్ చేయడానికి ఈ ఫండ్ రూపొందించారు. రియల్టీ డెవలపర్లు, మార్కెట్ లీడర్లు, దేశంలోని మైక్రో మార్కెట్లలో కీలక సంస్థలకు మూలధనాన్ని కేటాయించడం ఈ ఫండ్ లక్ష్యం.

ఇదీ చదవండి: భారీగా పెరిగిన ఇన్ఫీ సీఈఓ వేతనం.. ఎంతంటే..

మీనాక్షి ఆల్టర్నేట్స్ సీఈఓ మహేష్ కాట్రగడ్డ మాట్లాడుతూ ఏఐఎఫ్ లైసెన్స్ పొందడం తమ వృద్ధికి కీలకంగా మారిందని చెప్పారు. తమ బృందం భవిష్యత్తు అవకాశాలను పక్కాగా అంచనా వేస్తోందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ వద్ద మూడు సంభావ్య ఒప్పందాలున్నాయన్నారు. కొన్నేళ్లుగా మీనాక్షి గ్రూప్ స్థిరమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మిస్తోంది. దీనిపనితీరు క్లీన్ ఎనర్జీ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్‌ విభాగంగా మీనాక్షి ఆల్టర్నేటివ్స్‌ను రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్‌లో వ్యూహాత్మక పెట్టుబడిదారుగా నిలబెట్టినట్లు సంస్థ అధికారులు తెలిపారు.

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)