Breaking News

మెక్‌డొనాల్డ్స్‌కి టొమాటో ‘మంట’ ఏం చేస్తోందో  తెలుసా?

Published on Fri, 07/07/2023 - 17:12

చెట్టెక్కి కూర్చున్న టొమాటో ధర సామాన్య ప్రజల్నే కాదు.. కార్పొరేట్‌ ఫుడ్‌ చైన్‌లను కూడా వణికిస్తోంది. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ చైన్ మెక్‌డొనాల్డ్స్ కి టొమాటో మంట సెగ బాగా తగిలింది.  టొమాటో ధర ఆకాశాన్నంటడంతో సాధారణ జనం టొమాటో లేకుండానే కాలం గడిపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు  రెస్టారెంట్లు కూడా టొమాటో లేకుండానే వంటకాలను వడ్డించేందుకు సిద్ధమైపోతున్నాయి. (నిమిషాల్లో రూ.500 కోట్లు: ప్రముఖ ఇన్వెస్టర్‌కి కలిసొచ్చిన అదృష్టం, కారణం!)

రికార్డు స్థాయికి చేరిన ధరల సెగతో మెక్‌డొనాల్డ్స్ మెనూ నుంచిటొమాటోను తొలగించేసింది. పెరిగిన ధరలు, సరఫరా లేకపోవడంతో టొమాటో లేకుండానే బర్గర్‌లు, పిజ్జాలాంటి వాటిని సరఫరా చేస్తోంది. తమ నాణ్యతా ప్రమాణాలకు తగినసరఫరా లేకపోవడమే  కారణమంటూ నోటీసులు అంటించడం ఇపుడు హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన చిత్రాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.(World Richest Beggar Bharat Jain: వరల్డ్‌లోనే రిచెస్ట్ బిచ్చగాడు ఎవరో తెలుసా? ఎన్ని కోట్ల ఆస్తి తెలిస్తే..?)

ఎంత ప్రయత్నించినా ప్రపంచ స్థాయిలో ఉండే నాణ్యతా ప్రమాణాలకు తగిన టొమాటో  దొరకడం లేదు. అందుకే కొన్నాళ్లు టొమాటో లేని ఆహార ఉత్పత్తులను అందించాల్సి వస్తోంది. దిగుమతికీ  కష్టపడుతున్నాం' అంటూ ఢిల్లీని కన్నాట్‌ ప్లాజా రెస్టారెంట్లలో నోటీసులు అతికించింది. సప్లయ్‌ చెయిన్‌లో నాణ్యమైన సమస్యలే కాకుండా,ధరల సమస్య కూడా తలెత్తిందని నిర్వాహకులు తెలిపారు. (40వేల కోట్లను తృణప్రాయంగా త్యజించిన బిలియనీర్‌ ఏకైక కొడుకు..ఏం చేశాడో తెలుసా?)

కాగా వాతావరణ పరిస్థితులు, భారీ వర్షాలతో దేశంలో టొమాటో దిగుబడి బాగా పడిపోయింది. ఫలితంగా అనేక నగరాల్లో కిలో టొమాటో రూ. 100 నుంచి 200వరకు పలుకుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు టొమాటాల కొరత కారణంగా ప్రత్యామ్నాయాల్ని వాడటమని సూచనలు, ప్రకటనలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా “టొమాటో ధరలు పెరుగుతున్నాయా? బదులుగా టొమాటోప్యూరీ వాడుకోండి”  అంటూ టాటా  బిగ్‌బాస్కెట్ షాపింగ్ యాప్‌ ప్రకటనను  విశేషంగా నిలుస్తోంది. గతంలో ఉల్లిపాయ ధరలు కూడా బాగా పెరిగినపుడు ఉల్లికి బదులుగా క్యాబేజీని వాడిన వైనాన్ని జనం గుర్తు చేసుకుంటున్నారు. 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)