Global War: బాబా వంగా చెప్పిన ఈ 3 నిజమైతే ప్రళయమే!
Breaking News
ట్రేడ్ వార్‌తో భారత్‌కు సవాళ్లు: మారిషస్ ప్రధాని
Published on Fri, 09/12/2025 - 19:44
ప్రతీకార సుంకాలు, వాణిజ్య వివాదాలతో భారత్‌కు భారీ సవాళ్లు ఎదురవుతున్నట్లు మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులామ్ పేర్కొన్నారు. రక్షణాత్మక విధానాలు పెరిగిపోవడం, ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య ఉధృతమవుతున్న ఆందోళనలు, వాతావరణ సంబంధ విఘాతాలు పలురకాల రిస్కులకు తెరతీస్తున్నట్లు తెలియజేశారు.
విదేశీ వ్యవహారాల శాఖ, ఇతర పారిశ్రామిక సమాఖ్యలతో కలసి ఫిక్కీ ఇక్కడ నిర్వహించిన మారిషన్ ఇండియా వ్యాపార సదస్సు(బిజినెస్ కాంక్లేవ్)లో నవీన్‌చంద్ర ప్రసంగించారు. సామాజిక, ఆర్థికాభివృద్ధిలో దీర్ఘకాలంగా మారిషస్‌కు భారత్ నమ్మకమైన భాగస్వామిగా నిలుస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అన్ని సమయాలలోనూ మారిషస్‌కు మద్దతివ్వడంలో ధృడంగా నిలుస్తున్నట్లు ప్రశంసించారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, విధానాలు అస్థిరంగా, అంచనాలకు అందని విధంగా మారినట్లు వ్యాఖ్యానించారు. సరఫరా వ్యవస్థలో అంతరాయాలు, అదుపుతప్పుతున్న రవాణా వ్యయాలు, వాతావరణ సంబంధ విఘాతాలు విభిన్న రిస్కులకు దారి చూపుతున్నట్లు వివరించారు.
Tags : 1