Breaking News

వేల కోట్లు వ‌సూలైన ట్యాక్స్

Published on Thu, 06/17/2021 - 08:59

న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021 ఏప్రిల్‌–22 మార్చి) జూన్‌ 15 వరకూ భారీగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చిచూస్తే 100.4 శాతం ఎగసి రూ.92,762 కోట్ల నుంచి రూ.1,85,871 కోట్లకు చేరాయి. సెకండ్‌ వేవ్‌ వల్ల ఎకానమీ తీవ్రంగా నష్టపోదన్న అంచనాలకు తాజా గణాంకాలు బలాన్నిస్తున్నాయి.ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్‌ (సీబీడీటీ) బుధవారం తాజా గణాంకాలను విడుదల చేసింది.

రిఫండ్స్‌ రూ.30,731 కోట్లు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకూ స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.2.16 లక్షల కోట్లు. గత ఏడాది ఇదే కాలంతో పోల్చిచూస్తే రూ.1.37 లక్షల కోట్ల నుంచి 57 శాతం పెరిగాయి. వీటిలో కార్పొరేట్‌ పన్నులు (సీఐటీ) రూ.96,923 కోట్లు. వ్యక్తిగత పన్నుల పరిమాణం రూ.1.19 లక్షల కోట్లు. రిఫండ్స్‌ అనంతరం నికర వసూళ్లు వరుసగా రూ.74,356 కోట్లు. రూ.1.11 లక్షల కోట్లుగా ఉన్నాయి. రిఫండ్స్‌ విలువ దాదాపు రూ.30,731 కోట్లు. కరోనా మొదటి వేవ్‌తో అతలాకుతలమైన 2020–21 ఆర్థిక సంవత్సరంలో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.9.45 లక్షల కోట్లు.   

చ‌ద‌వండి: వేల కోట్ల నష‍్టం: అదానీ గ్రూప్ సీఎఫ్‌ఓ స్పందన
 

Videos

పాక్ లో నన్ను పెళ్లి చేసుకో.. టెర్రరిస్టులతో జ్యోతి లవ్ స్టోరీ

గరం ఛాయ్ సెలబ్రేషన్స్

మాపై కక్ష ఉంటే తీర్చుకోండి.. కానీ 18వేల మంది కుటుంబాలను రోడ్డున పడేయకండి..

ఢిల్లీ ఢమాల్.. ప్లే ఆఫ్ కు ముంబై

Big Question: అరెస్టులు తప్ప ఆధారాలు లేవు.. మద్యం కేసు మటాష్

కూటమి ప్రభుత్వ అరాచకాలను, దాష్టికాలను దీటుగా ఎదుర్కొందాం: YS జగన్

ఇవాళ ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ ప్రెస్ మీట్...

అమెరికా గోల్డెన్ డోమ్.. అంతరిక్షంలో ఆయుధాలు

మావోయిస్ట్ పార్టీని ఊచకోత కోస్తోన్న ఆపరేషన్ కగార్

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

Photos

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )