Breaking News

ఒక్క ఆలోచనతో రూ.15780 కోట్ల బిజినెస్.. ఎవరీ 'ప్రతీక్ సూరి'?

Published on Sun, 05/26/2024 - 15:19

చదువు పూర్తయిన తరువాత ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకునే వారు చాలామంది ఉన్నారు. అయితే బిజినెస్ చేసి ఎదగాలని చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. అలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'ప్రతీక్ సూరి'. ఇంతకీ ఈయన ఎవరు? ఈయన చేస్తున్న బిజినెస్ ఏంటి? వ్యాపారంలో ఎలా సక్సెస్ సాధించారు అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ఢిల్లీకి చెందిన ప్రతీక్ సూరి తన పాఠశాల విద్యను బరాఖంబా రోడ్‌లోని మోడరన్ స్కూల్‌లో పూర్తి చేశారు. ఆ తరువాత 2006లో అతను దుబాయ్‌లోని బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజనీరింగ్‌ చదవడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి వెళ్లాడు.

దుబాయ్‌లో చదువుకునే రోజుల్లోనే.. సుమారు 200 విభిన్న దేశాలకు చెందిన వ్యక్తులతో కూడిన యూఏఈ జనాభాలోని అపారమైన వైవిధ్యం అతనిని ఎంతగానో ఆకర్షించింది. ఆ సమయంలోనే గ్లోబల్ కమ్యూనిటీలో లీనమవ్వడం కావలసిన అపరిమితమైన అవకాశాల గురించి కూడా తెలుసుకున్నారు.

చదువు పూర్తయిన తరువాత.. సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచించి.. అనుకున్న విధంగానే 2012 ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను ఉత్పత్తి చేసే 'మాసర్' (Maser) సంస్థను స్థాపించారు. ఈ సంస్థ అతి తక్కువ కాలంలోనే ఆఫ్రికన్ మార్కెట్‌లో కూడా విస్తరించింది.

కంపెనీ ఉత్పత్తి అయిన స్మార్ట్ టీవీ.. ఆఫ్రికన్ మార్కెట్‌లో అనూహ్యమైన ఆదరణ పొందగలిగింది. ఆ సమయంలో కంపెనీ ఏకంగా 8,00,000 యూనిట్ల బ్రాండ్ స్మార్ట్ టీవీలను విక్రయించగలిగింది. ఆ తరువాత ఆఫ్రికన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పెట్టుబడులు పెట్టడంతో మాసర్ కంపెనీ మరింత గణనీయమైన పురోగతిని సాధించగలిగింది.

ప్రతీక్ సూరి అచంచలమైన కృషి వల్ల కంపెనీ రోజు రోజుకి అభివృద్ధి వైపు అడుగులు వేసింది. వ్యాపార రంగంలో విజయవంతమైన బెంచ్‌మార్క్‌ను ఏర్పాటు చేసింది. 2023లో మాసర్ నికర విలువ ఏకంగా 1.9 బిలియన్ డాలర్లకు చేరింది. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.15,780 కోట్లు. పోటీ వ్యాపార ప్రపంచంలో తనదైన ముద్ర వేయడానికి ఎదురయ్యే అడ్డంకులను ధిక్కరించి సెల్ఫ్ మేడ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిన ప్రతీక్ సూరి కథ నేడు వ్యాపార ప్రపంచంలో ఎంతోమందికి ఆదర్శప్రాయం.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)