Breaking News

మారుతీ కొత్త ఎస్‌యూవీ ‘విక్టోరిస్‌’

Published on Thu, 09/04/2025 - 08:48

ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ తాజాగా ‘విక్టోరిస్‌’ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. తద్వారా మిడ్‌ సైజ్‌ ఎస్‌యూవీల (స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్‌) విభాగంలో వాహనాల శ్రేణిని మరింతగా విస్తరించింది. అయితే దీని ధర ఎంత అనేది కంపెనీ వెల్లడించలేదు. విక్టోరిస్‌ను అభివృద్ధి చేయడంపై సుమారు రూ.1,240 కోట్లు ఇన్వెస్ట్‌ చేసినట్లు సంస్థ తెలిపింది. ఇందులో హైబ్రిడ్, సీఎన్‌జీ వెర్షన్లు కూడా ఉన్నాయి.

కొత్త తరం కస్టమర్లు వస్తున్న నేపథ్యంలో దేశీయంగా ఆటోమొబైల్‌ పరిశ్రమ రూపురేఖలు మారుతున్నాయని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ హిసాషి తకెయుచి తెలిపారు. ఈ నేపథ్యంలో గణనీయంగా పెరుగుతున్న యువ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని విక్టోరిస్‌ను రూపొందించినట్లు చెప్పారు. దీన్ని 100 పైగా మార్కెట్లకు కూడా ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు. తమ మొత్తం అమ్మకాల్లో ఎస్‌యూవీల వాటా 2020–21 ఆర్థిక సంవత్సరంలో 8.9 శాతంగా ఉండగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 28 శాతానికి ఎగిసిందని తకెయుచి వివరించారు.

మారుతీ సుజుకీ ప్రస్తుతం ఫ్రాంక్స్, బ్రెజా, జిమ్నీ, గ్రాండ్‌ విటారా లాంటి ఎస్‌యూవీలను విక్రయిస్తోంది. దేశీయంగా మిడ్‌–సైజ్‌ ఎస్‌యూవీల అమ్మకాలు ప్రస్తుతం ఏటా 9.5 లక్షల యూనిట్లుగా ఉండగా, మొత్తం ఎస్‌యూవీల మార్కెట్లో వీటి వాటా 40 శాతంగా ఉంది.

ఇదీ చదవండి: టీసీఎస్‌ ఉద్యోగులకు తీపికబురు

#

Tags : 1

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)