8 వేల మారుతీ సుజుకీ సర్వీసింగ్‌ కేంద్రాలు

Published on Fri, 12/13/2024 - 12:39

వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా దేశవ్యాప్తంగా సర్వీసింగ్‌ కేంద్రాలను విస్తరిస్తోంది. 2030–31 నాటికి మొత్తం 8,000 టచ్‌ పాయింట్లు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా చేసుకున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ తెలిపారు. నెక్సా 500వ టచ్‌ పాయింట్‌ను కంపెనీ తాజాగా ప్రారంభించింది.

నెక్సా, అరీనా బ్రాండ్లలో మారుతీ సుజుకీ ఇండియాకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,240 సర్వీసింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ‘కస్టమర్లకు సౌలభ్యం, అత్యుత్తమ కారు యాజమాన్య అనుభవాన్ని స్థిరంగా అందించడమే మా లక్ష్యం. వినియోగదార్లకు దగ్గరవ్వాలి. తద్వారా సమీపంలో మారుతీ సుజుకీ సర్వీస్‌ టచ్‌పాయింట్‌ని కనుగొనగలమన్న భరోసా వారికి ఉంటుంది. వార్షిక తయారీ సామర్థ్యాన్ని, అమ్మకాలను గణనీయంగా పెంచడానికి ప్రణాళిక చేస్తున్నందున సర్వీస్‌ నెట్‌వర్క్‌ను ఏకకాలంలో బలోపేతం చేస్తాం’ అని టాకేయూచీ వివరించారు.

మారుతీ సుజుకీ తన మొదటి నెక్సా సర్వీస్‌ సెంటర్‌ను 2017 జూలైలో ప్రారంభించింది. 2023–24లో 90 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒక సంవత్సరంలో ఇదే అత్యధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కంపెనీ కొత్తగా 78 నెక్సా సర్వీస్‌ టచ్‌పాయింట్లను తెరిచింది. 500ల సర్వీస్‌ టచ్‌పాయింట్ల మైలురాయిని 7 సంవత్సరాల 5 నెలల వ్యవధిలో చేరుకుంది.

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)