Breaking News

కొత్త మారుతి సియాజ్‌ వచ్చేసింది..సూపర్‌ సేఫ్టీ ఫీచర్లతో

Published on Wed, 02/15/2023 - 12:55

సాక్షి, ముంబై: మారుతి సుజుకి భారతీయ మార్కెట్లో తన అప్డేటెడ్ 'సియాజ్‌' లాంచ్ చేసింది. ఇది డ్యూయెల్ టోన్ పెయింటింగ్ స్కీమ్ పొందటంతో పాటు అదనపు సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇది కేవలం ఆల్ఫా ట్రిమ్‌కి మాత్రమే పరిమితం చేయబడింది.

మారుతి సియాజ్‌ సెడాన్ ఇప్పుడు పెర్ల్ మెటాలిక్ ఓపులెంట్ రెడ్ విత్ బ్లాక్ రూఫ్, పెర్ల్ మెటాలిక్ గ్రాండ్యుర్ గ్రే విత్ బ్లాక్ రూఫ్ మరియు డిగ్నిటీ బ్రౌన్ విత్ బ్లాక్ రూఫ్ అనే డ్యూయెల్ టోన్ కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. దీని మాన్యువల్ వేరియంట్ ధర రూ. 11.14 లక్షలు కాగా, ఆటోమేటిక్ ధర 12.34 లక్షలు (ధరలు, ఎక్స్-షోరూమ్). 

అప్డేటెడ్ సియాజ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ అసిస్ట్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఏబీఎస్ విత్ ఈబిడి, ISOFIX చైల్డ్ సీట్ యాంకరింగ్ పాయింట్ వంటి 20 కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంది.

ఇంజిన్ విషయానికి వస్తే, మారుతి సియాజ్‌ 1.5-లీటర్ ఫోర్ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ కలిగి 103 బిహెచ్‌పి పవర్ , 138 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ & 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

ఫీచర్స్ పరంగా ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కలిగి ఉంది. ఈ సెడాన్ కోసం దేశ వ్యాప్తంగా ఉన్న నెక్సా షోరూమ్‌లలో బుక్ చేసుకోవచ్చు.

Videos

ట్రంప్ సర్కారుకు షాక్

లిక్కర్ స్కామ్ డైరెక్టర్.. బాబుకు టెన్షన్ పెట్టిస్తున్న ఈనాడు ప్రకటన..

తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కలవరం

యాపిల్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక

నా లేఖ లీక్ వెనుక పెద్ద కుట్ర ఉంది..

బెంగళూరుపై హైదరాబాద్ విజయం

అప్పుల కుప్ప అమరావతి

హరికృష్ణకు పోలీసుల వేధింపులపై YS జగన్ ఫైర్

వల్లభనేని వంశీని చంపేస్తారా..!

వల్లభనేని వంశీకి అస్వస్థత

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)