Breaking News

ఆఫ్‌-రోడ్‌లో దూసుకెళ్లే ‘జిమ్నీ’.. లక్ష మంది కొనేశారు..

Published on Fri, 06/13/2025 - 18:21

ఆఫ్‌-రోడ్‌లో దూసుకెళ్లే మారుతి సుజుకి జిమ్నీ విక్రయాల్లోనూ దూసుకెళ్లింది. సరికొత్త మైలురాయిని దాటింది. మారుతి సుజుకి జిమ్నీ మొదటిసారిగా 2023 జూన్‌లో భారత మార్కెట్లో లాంచ్ అయింది. అప్పటి నుండి ఈ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ 5-డోర్ల వెర్షన్ లక్ష యూనిట్లకు పైగా అమ్మకాలను నమోదు చేసింది. ఆటోకార్ ప్రొఫెషనల్స్ నివేదిక ప్రకారం.. రెండు సంవత్సరాలలో ఈ వాహనం మొత్తం 1,02,024 యూనిట్ల అమ్మకాలను సాధించింది.

మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ మొత్తం విక్రయాల్లో దేశీయ మార్కెట్లో విక్రయించిన 26,180 యూనిట్లు (2025 ఏప్రిల్ చివరి వరకు లాంచ్ అయినవి), 75,844 ఎగుమతి యూనిట్లు (2025 ఏప్రిల్ చివరి వరకు లాంచ్ అయినవి) ఉన్నాయి. అయితే మారుతి సుజుకి జిమ్నీ అమ్మకాల సంఖ్య పరంగా దాని ప్రధాన ప్రత్యర్థులలో ఒకటైన మహీంద్రా థార్ శ్రేణి కంటే చాలా వెనుకబడి ఉంది. 2020 అక్టోబర్‌లో లాంచ్ అయినప్పటి నుండి 2025 ఏప్రిల్ చివరి వరకు మూడు డోర్ల థార్, థార్ రాక్స్ తో, ఎస్‌యూవీ శ్రేణి మొత్తం 2,59,921 యూనిట్లతో 2.5 లక్షల అమ్మకాల మైలురాయిని దాటింది.

మారుతి సుజుకి జిమ్నీ మూడు డోర్ల వర్షన్‌ ప్రపంచ మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందింది. ఈ పాపులారిటీని పునరావృతం చేయడానికి కంపెనీ ఐదు డోర్ల వెర్షన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆఫ్-రోడర్ కొనుగోలుదారులను ఆకర్షించే లక్ష్యంతో ఈ వాహనం 4×4 సిస్టమ్‌తో బాడీ-ఆన్-ఫ్రేమ్ డిజైన్‌తో వచ్చింది. ఈ ఎస్‌యూవీ భారత మార్కెట్‌లో రూ .12.75 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అమ్మడవుతోంది. దీనిని గురుగ్రామ్ ప్లాంట్లో తయారు చేసి జపాన్ వంటి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నారు.

మారుతి సుజుకి జిమ్నీలో సింగిల్ 1.5-లీటర్ నాలుగు సిలిండర్ల నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 105 బీహెచ్‌పీ పవర్‌ని, 134 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో జతచేయబడి ఉంటుంది. మాన్యువల్ వెర్షన్ లీటరుకు 16.94 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా, ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 16.39 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)