Breaking News

మారుతి సుజుకి ఫ్రాంక్స్ మైలేజ్ తెలిసిపోయింది: చూసారా..!

Published on Tue, 04/04/2023 - 21:20

2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టి ఎంతోమంది వాహన ప్రేమికుల మనసుదోచిన మారుతి సుజుకి ఫ్రాంక్స్ త్వరలో దేశీయ మార్కెట్లో విడుదల కానుంది. ఈ SUV భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదలకాకముందే 13,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది. కంపెనీ గతంలో ఈ కారు డిజైన్, ఫీచర్స్ గురించి వెల్లడించింది, అయితే తాజాగా ఇప్పుడు మైలేజ్ గురించి ప్రస్తావించింది.

ఇంజిన్ ఆప్షన్స్:
మారుతి సుజుకి ఫ్రాంక్స్ రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందనుంది. ఇందులో మొదటిది 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజిన్ కాగా, రెండవది 1.0 టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇవి రెండూ వరుసగా 88.5 బిహెచ్‌పి పవర్, 113 ఎన్ఎమ్ టార్క్ & 98.6 బిహెచ్‌పి పవర్, 147.6 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తాయి. రెండు ఇంజిన్లు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్ పొందుతాయి.

మైలేజ్:
మారుతి ఫ్రాంక్స్ 1.2 పెట్రోల్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ 21.79 కిలోమీటర్స్/లీటర్ మైలేజ్ అందిస్తుంది. అదే సమయంలో 1.0 టర్బో పెట్రోల్ మ్యాన్యువల్ 21.5 కిమీ/లీ & ఆటోమాటిక్ వేరియంట్ 20.01 కిమీ/లీ మైలేజ్ అందిస్తాయి.

(ఇదీ చదవండి: నాడు 150 సార్లు తిరస్కరించారు.. నేడు రూ. 65వేల కోట్లకు అధిపతి అయ్యాడు)

డిజైన్ & ఫీచర్స్:
మారుతి ఫ్రాంక్స్ స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌ కలిగి, రెండు చివర్లలో ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్ పొందుతాయి. సైడ్ ప్రొఫైల్ లో 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వెనుక వైపు వెడల్పు అంతటా విస్తరించి ఉండే లైట్ బార్ కూడా ఉంటుంది. 

ఈ కొత్త SUV ప్రీమియం డ్యూయల్-టోన్ ఇంటీరియర్ పొందుతుంది. ఇందులో 9 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఏసీ వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ మొదలైన ఫీచర్స్ ఇందులో లభిస్తాయి.

అంచనా ధరలు & లాంచ్ డేట్:
మారుతి ఫ్రాంక్స్ ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు, కానీ ఇది రూ. 8 లక్షల ప్రారంభ ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉందని ఆశిస్తున్నాము. ఈ SUV ఈ నెల చివరి నాటికి మార్కెట్లో విడుదల కానుంది. డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది మార్కెట్లో సిట్రోయెన్ C3, టాటా పంచ్, నిస్సాన్ మాగ్నైట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)