Breaking News

ఈ-విటారా లాంచ్ డేట్ ఫిక్స్!: పూర్తి వివరాలు

Published on Sat, 11/29/2025 - 20:15

మారుతి సుజుకి తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు 'ఈ-విటారా'ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. దీనిని కంపెనీ డిసెంబర్ 2న మార్కెట్లో అధికారికంగా ప్రవేశపెట్టనుంది. ఈ లేటెస్ట్ ఈవీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ, ఈ కథనంలో..

మారుతి సుజుకి ఈ-విటారా స్టైలింగ్ మొత్తం.. ఈవీఎక్స్ కాన్సెప్ట్ మాదిరిగా ఉంటుంది. ఇందులో వై-షేప్ డీఆర్ఎల్, యాంగ్యులర్ హెడ్‌ల్యాంప్ యూనిట్లు, వీల్ ఆర్చ్‌లు ఉన్నాయి.టెయిల్-ల్యాంప్ డిజైన్ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఇందులో కొత్త డాష్‌బోర్డ్ ఉండటం గమనించవచ్చు. ఒక జత ఫ్రీ-స్టాండింగ్ డిస్‌ప్లేలు, డాష్‌బోర్డ్ పైభాగంలో ఉన్నాయి. ఫాసియా అంతటా సాఫ్ట్-టచ్ ప్యానెల్ ఉంటుంది. సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ వెంట్స్ క్రింద ఒక చిన్న సెట్ ఫిజికల్ కంట్రోల్స్ ఉన్నాయి. గేర్ సెలెక్టర్‌ను రోటరీ డయల్‌తో భర్తీ చేశారు.

ఈ-విటారా కారులో.. 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, యాంబియంట్ లైటింగ్, టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, కీలెస్ ఎంట్రీ అండ్ స్టార్ట్, నాలుగు స్పీకర్లు & ఆటో డిమ్మింగ్ ఇంటీరియర్ రియర్-వ్యూ మిర్రర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. టాప్ వేరియంట్లలో 19 అంగుళాల అల్లాయ్ వీల్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 10-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఇన్ఫినిటీ ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఫాగ్ ల్యాంప్‌లు & 360-డిగ్రీల కెమెరా వంటివి ఉన్నాయి.

మారుతి సుజుకి ఈ-విటారా 49 kWh & 61 kWh బ్యాటరీ ప్యాక్స్ పొందే అవకాశం ఉంది. రేంజ్ విషయం లాంచ్ తరువాత తెలుస్తుంది. కానీ ఇది 428 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇది హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ EV, మహీంద్రా BE 6 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ధరలు లాంచ్ సమయంలోనే వెల్లడవుతాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)