దేశం దాటిన 50వేల ఎలక్ట్రిక్ కార్లు!

Published on Thu, 10/29/2026 - 17:00

అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి.. ఆగస్టు 2025లో భారత్ నుంచి ఎగుమతి ప్రారంభించినప్పటి నుంచి 50,000 యూనిట్ల మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ కార్లను తరలించింది. ఈ ఎగుమతుల్లో ప్రధానంగా గుజరాత్‌లోని హన్సల్‌పూర్ ప్లాంట్‌లో తయారు చేసిన ఈ విటారా ఉంది.

మారుతి సుజుకి తన ఈ-విటారాను భారతదేశం నుంచి యూకే, నార్వే, జర్మనీ, జపాన్, స్విట్జర్లాండ్‌తో సహా దాదాపు 50 దేశాలకు ఎగుమతి చేసింది. ఎక్కువ భాగం ఐరోపాకు తరలించినట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే.. కంపెనీ తన ఉనినికి గ్లోబల్ మార్కెట్లో కూడా భారీగానే విస్తరిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) వారి డేటా ప్రకారం.. ఏప్రిల్ - సెప్టెంబర్ 2026 మధ్య భారతదేశం నుంచి ఎగుమతి చేసిన ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలలో 93 శాతం వాటా మారుతి సుజుకిదే కావడం గమనార్హం.

మారుతి సుజుకి ప్రస్తుతం దాదాపు 120 దేశాలకు 16 మోడళ్లను ఎగుమతి చేస్తోంది. ఏప్రిల్-సెప్టెంబర్ 2026 మధ్యకాలంలో భారతదేశపు మొత్తం ప్యాసింజర్ వాహన ఎగుమతులలో 50% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. ఈ వృద్ధిలో హన్సల్‌పూర్ ప్లాంట్ కీలక పాత్ర పోషించింది. ఇక్కడ వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 10 లక్షల వాహనాలకు చేరినట్లు సమాచారం.

ఉత్పత్తి ఎక్కువగా ఉండటం వల్ల.. మారుతి సుజుకి తమ కార్లను భారతదేశంలో విక్రయిస్తూనే, విదేశాలకు ఎగుమతి చేయగలుగుతుంది. మారుతి సుజుకి ఈ ప్లాంట్‌లో రూ. 25,288.7 కోట్లు పెట్టుబడి పెట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో, కంపెనీ మొత్తం విదేశీ ఎగుమతులలో దాదాపు సగం హన్సల్‌పూర్ నుండే జరిగాయి. దీంతో ఇది కేవలం ఈవీ ఉత్పత్తికే కాకుండా, ఎగుమతి వ్యూహానికి కూడా ఒక కీలక కేంద్రంగా నిలిచింది.

Videos

అడుగడుగునా భారీ రెస్పాన్స్.. విజయవాడ మేయర్ మాదే!

ఈసీకి YSRCP లేఖ.. పెన్షన్ల పేరుతో ఓటర్లకు టీడీపీ గాలం..

వరుదు కళ్యాణికి నా మద్దతు.. దయచేసి ఓటు వేసి గెలిపించండి

కూటమి నాయకులు ఓటు అడిగితే జనాలు చెప్పులు చూపిస్తున్నారు

అండమాన్ లో అల్పపీడనం.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు...

ఒక మాఫియా ముఠా దిగుతోంది.. పోలింగ్ బూత్ వద్ద మీరు చేయాల్సింది ఒక్కటే

మమ్మల్ని కొడితే కొట్టారు.. నామినేషన్లు వేయకుండా జనసేన నేతలను కొట్టడం ఏంట్రా

వరుదు కళ్యాణి అనే నేను.. ప్రచారంలో ఆసక్తికర సన్నివేశం

హృదయవిదారక ఘటన.. తండ్రి జైలులో.. నానమ్మతో కలిసి ప్రచారంలో పిల్లలు

నన్ను రౌడీ అంటావా? ABV గుట్టు రట్టు చేసిన గౌతంరెడ్డి!

Photos

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ సినిమా టీజర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

వేడుకగా కర్వాచౌత్‌ ...సెలబ్రిటీల సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతాకోకచిలుకలా సీతారామం బ్యూటీ మృణాల్.. (ఫోటోలు)

+5

గ్రీన్ డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

ఆదర్శ కుటుంబం హీరోయిన్ శ్రీనిధి శెట్టి బ్యూటీఫుల్ లుక్స్.. (ఫోటోలు)

+5

రెడ్ రోజ్‌లా మెరిసిపోతున్న నివేదా పేతురాజ్.. (ఫోటోలు)

+5

మన్మధుడు హీరోయిన్ అన్షు కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

విశ్వక్ సేన్‌ కల్ట్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన అడ్వెంచర్ స్పాట్స్ ఎక్కడో తెలుసా? (ఫోటోలు)