Breaking News

30 లక్షల యూనిట్లు ఎగుమతి!

Published on Tue, 11/26/2024 - 07:39

వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా మొత్తంగా ఇప్పటి వరకు 30 లక్షల యూనిట్ల కార్లను వివిధ దేశాలకు ఎగుమతి చేసింది. తాజాగా గుజరాత్‌లోని పిపావావ్‌ పోర్ట్‌ నుంచి సెలెరియో, ఫ్రాంక్స్, జిమ్నీ, బలేనో, సియాజ్, డిజైర్, ఎస్‌–ప్రెస్సో వంటి మోడళ్లతో కూడిన 1,053 యూనిట్ల రవాణాతో కంపెనీ కొత్త మైలురాయిని సాధించింది. 2030–31 నాటికి విదేశాలకు ఏటా 7.5 లక్షల యూనిట్లను సరఫరా చేయాలని లక్ష్యంగా చేసుకున్నట్టు సంస్థ తెలిపింది. భారత ప్రభుత్వ మేక్‌ ఇన్‌ ఇండియా చొరవతో మరింత స్థానికీకరణ, ఎగుమతులను రెట్టింపు చేయడం కోసం  కట్టుబడి ఉన్నామని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ ఒక ప్రకటనలో తెలిపారు.  

నాలుగేళ్లలో మూడు రెట్లు..

భారత్‌ నుంచి ఎగుమతి అవుతున్న మొత్తం ప్రయాణికుల వాహనాల్లో 40 శాతం వాటా తమ సంస్థ కైవసం చేసుకుందని టాకేయూచీ చెప్పారు. దేశం నుంచి కంపెనీ ఎగుమతులు నాలుగేళ్లలో మూడు రెట్లు పెరిగాయని వెల్లడించారు. ఈ గ్లోబల్‌ డిమాండ్‌ ద్వారా ప్రేరణ పొంది 2030–31 నాటికి వాహన ఎగుమతులను 7.5 లక్షల యూనిట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలు, కొన్ని మార్కెట్లతో వాణిజ్య ఒప్పందాలు కంపెనీ ఎగుమతుల వృద్ధిని పెంచుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–అక్టోబర్‌ కాలంలో మారుతీ సుజుకీ ఇండియా 1,81,444 యూనిట్లను ఎగుమతి చేసింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 17 శాతం వృద్ధిని సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 2.83 లక్షల యూనిట్లను వివిధ దేశాలకు సరఫరా చేసింది.

ఇదీ చదవండి: ఐపీవోకు తొలి ఎస్‌ఎం రీట్‌

అత్యంత వేగంగా 10 లక్షల యూనిట్లు ఎగుమతి

ప్రస్తుతం కంపెనీ లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, మధ్యప్రాచ్యంలోని దాదాపు 100 దేశాల్లో 17 మోడళ్లను విక్రయిస్తోంది. ఫ్రాంక్స్, జిమ్నీ, బలేనో, డిజైర్, ఎస్‌–ప్రెస్సో అధికంగా ఎగుమతి అవుతున్న టాప్‌ మోడళ్లుగా నిలిచాయి. 1986 నుంచి మారుతీ సుజుకీ భారత్‌లో తయారైన కార్లను విదేశాలకు సరఫరాను ప్రారంభించింది. కంపెనీ వాహన ఎగుమతుల్లో తొలి 10 లక్షల యూనిట్ల మార్కును 2012–13లో సాధించింది. తొమ్మిదేళ్లలోనే 20 లక్షల యూనిట్ల మైలురాయిని 2020–21లో అందుకుంది. 30 లక్షల యూనిట్ల స్థాయికి మూడు సంవత్సరాల తొమ్మిది నెలల్లోనే సంస్థ సాధించింది. ఇది కంపెనీకి అత్యంత వేగవంతమైన మిలియన్‌గా నిలవడం విశేషం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)