Breaking News

మారుతి జిమ్నీ డెలివరీలు అప్పుడే!

Published on Thu, 03/30/2023 - 20:22

మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో త్వరలో జిమ్నీ SUVని అధికారికంగా విడుదల చేయనుంది, ఇప్పటికే ఈ కొత్త మోడల్ కోసం 23,500 కంటే ఎక్కువ బుకింగ్స్ వచ్చాయి. కాగా ఎంపిక చేసిన నెక్సా అవుట్‌లెట్లలో ఈ కొత్త కారు డిస్‌ప్లే కూడా ప్రారంభమైంది. త్వరలో మరిన్ని అవుట్‌లెట్లలో దర్శనమిచ్చే అవకాశం ఉంది. 

2023 ఆటో ఎక్స్‌పోలో అరంగేట్రం చేసిన జిమ్నీ మే నెలలో విక్రయానికి రానున్నట్లు సమాచారం, కానీ అంతకంటే ముందు ఏప్రిల్ 7 నుంచి భారతదేశంలో మరికొన్ని నగరాల్లోని డీలర్‌షిప్‌లలో కనిపించనుంది. ఇప్పటికే ముంబై, ఢిల్లీ NCR, అహ్మదాబాద్, చండీగఢ్, మొహాలి, లూథియానా, రాయ్‌పూర్, భువనేశ్వర్, బెంగళూరు వంటి నగరాల్లో ప్రదర్శన మొదలైపోయింది. ఆసక్తి కలిగిన కస్టమర్లు అక్కడ జిమ్నీ కారుని పరిశీలించవచ్చు.

మారుతి జిమ్నీ ఉత్పత్తి గురుగ్రామ్ ప్లాంట్‌లో జరుగుతుంది. ఇక్కడ నుంచే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు విక్రయించనుంది. కంపెనీ సంవత్సరానికి లక్ష యూనిట్లను ఉత్పత్తి చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. అదే సమయంలో ప్రతి నెల 7,000 యూనిట్లను భారతీయ మార్కెట్లో, మిగిలినవాటిని విదేశీయ మార్కెట్లో విక్రయించనున్నట్లు సమాచారం.

(ఇదీ చదవండి: ప్రపంచంలో అతిపెద్ద లిక్కర్ సామ్రాజ్యం: ఇకపై మహిళ సారథ్యంలో..)

మారుతి సుజుకి జిమ్నీ డిజైన్ పరంగా చాలా ఆధునికంగా ఉండటమే కాకుండా, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఇది జీటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్స్‌లో విడుదలకానుంది. సేఫ్టీ ఫీచర్స్ కూడా కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది.

కొత్త మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ వెర్షన్ K15B పెట్రోల్ ఇంజన్‌తో 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 104 బిహెచ్‌పి పవర్, 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 135 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ & 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇది కైనెటిక్ ఎల్లో, సిజ్లింగ్ రెడ్, గ్రానైట్ గ్రే, నెక్సా బ్లూ, బ్లూయిష్ బ్లాక్, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఎస్‌యువి ధరలు ఇంకా అధికారికంగా విడుదల కాలేదు, కానీ దీని ప్రారంభ ధర రూ. 12 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నాము.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)