Breaking News

అమ్మకాల్లో హవా.. ఉత్పత్తిలో రికార్డ్: ఏకంగా ఐదు లక్షలు

Published on Tue, 08/19/2025 - 21:19

ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తూ.. వినియోగదారులను ఆకట్టుకుంటున్న మారుతి సుజుకి అమ్మకాల్లో కూడా అరుదైన మైలురాళ్లను చేరుకుంటోంది. దీన్నిబట్టి చూస్తుంటే ఉత్పత్తి కూడా వేగంగా జరుగుతోందని తెలుస్తోంది.

2023లో మార్కెట్లో లాంచ్ అయిన మారుతి సుజుకి ఫ్రాంక్స్.. ఇటీవల 5,00,000 యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకుంది. ఈ కారు ప్రతి నెలా 12,000 నుంచి 15,000 యూనిట్ల అమ్మకాలను సాధించగలిగింది. 2023 మార్చిలో ఫ్రాంక్స్ ఉత్పత్తిని ప్రారంభించినప్పటి నుంచి 2023 డిసెంబర్ నాటికి.. కేవలం 9 నెలల్లో కంపెనీ లక్ష యూనిట్లను ఉత్పత్తి చేసింది.

2024 జూన్ నాటికి రెండు లక్షల యూనిట్లు, నవంబర్ 2024 నాటికి 3 లక్షల యూనిట్లు, ఫిబ్రవరి 2025 నాటికి 4 లక్షల యూనిట్ల ఉత్పత్తి జరిగింది. కాగా జులైలో దీని ఉత్పత్తి 5 లక్షల యూనిట్లకు చేరుకుంది. అమ్మకాల్లో కూడా దూసుకెళ్తున్న ఈ SUV మొత్తం 5 వేరియంట్లలో లభిస్తుంది. అవి సిగ్మా, డెల్టా, డెల్టా ప్లస్, జీటా & ఆల్ఫా వేరియంట్స్. వీటి ధరలు రూ. 7.59 లక్షల నుంచి రూ. 13.07 లక్షల (ఎక్స్ షోరూం) మధ్య ఉన్నాయి.

ఇదీ చదవండి: భారత్‌లో అమెరికన్ బ్రాండ్ బైక్ లాంచ్: ధర ఎంతంటే?

మారుతి ఫ్రాంక్స్ 1.2-లీటర్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో వస్తుంది. ఇవి రెండూ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌, 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ పొందుతాయి. కాబట్టి పనితీరు ఉత్తమంగా ఉంటుంది. ఈ కారు భారతదేశంలో మాత్రమే కాకుండా.. ఇతర దేశాల్లో కూడా మంచి విక్రయాలను పొందుతోంది. ఈ కారణంగానే ఎగుమతుల్లో కూడా దూసుకెళ్తోంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)