Breaking News

రోజుకు 1000 మంది కొన్న కారు ఇదే..

Published on Mon, 12/02/2024 - 16:53

దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా.. ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన 4వ తరం డిజైర్ కోసం రోజుకు 1,000 బుకింగ్స్ పొందుతోంది. ఇందులో సగం కంటే ఎక్కువ మంది కస్టమర్లు మొదటి రెండు వేరియంట్లను ఎంచుకుంటున్నట్లు సమాచారం.

నవంబర్ 11న డిజైర్ బుకింగ్స్ ప్రారంభించిన మారుతి సుజుకి.. మొత్తం 30వేల కంటే ఎక్కువ బుకింగ్స్ పొందినట్లు సమాచారం. కాగా సంస్థ 5000 మందికి ఈ కొత్త కారును డెలివరీ చేసింది.

LXi, VXi, ZXi & ZXi+ అనే నాలుగు వేరియంట్లలో లభించే మారుతి సుజుకి డిజైర్ ధరలు రూ. 6.79 లక్షల నుంచి రూ. 10.14 లక్షల మధ్య ఉన్నాయి. ఎక్కువమంది జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ కార్లను బుక్ చేసుకుంటున్నట్లు సమాచారం. డిజైర్ కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్‌లో 61% వాటాను కలిగి ఉంది.

అమ్మకాల్లో హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉన్న మారుతి డిజైర్ 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. పనితీరు పరంగా కూడా ఇది ఉత్తమంగా ఉంటుంది.

2024 డిజైర్ ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ క్రిస్టల్ విజన్ హెడ్‌ల్యాంప్‌, ఎల్ఈడీ రియర్ కాంబినేషన్ ల్యాంప్స్, 15 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, 9 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ ఏసీ, క్రూయిజ్ కంట్రోల్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, రియర్ ఏసీ వెంట్స్, రియర్ ఆర్మ్‌రెస్ట్, సుజుకి కనెక్ట్ వంటి అనేక ఫీచర్స్ పొందుతుంది.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)