Breaking News

3 రోజుల్లో 1,802 పాయింట్లు అప్‌

Published on Wed, 12/04/2024 - 04:26

ముంబై: ప్రధానంగా పీఎస్‌యూ, ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ షేర్లకు పెరిగిన డిమాండ్‌తో వరుసగా మూడో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరు చూపాయి. సెన్సెక్స్‌ 598 పాయింట్లు జంప్‌చేసి 80,846 వద్ద ముగిసింది. నిఫ్టీ 181 పాయింట్ల వృద్ధితో 24,457 వద్ద నిలిచింది. వెరసి మూడు రోజుల్లో సెన్సెక్స్‌ 1,802 పాయింట్లు జమ చేసుకుంది. మరోసారి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో ఒక దశలో సెన్సెక్స్‌ 701, నిఫ్టీ 205 పాయింట్లు చొప్పున ఎగశాయి.

ఇంట్రాడేలో సెన్సెక్స్‌ గరిష్టంగా 81,000 సమీపాని(80,949)కి చేరింది. గ్లోబల్‌ మార్కెట్ల సానుకూలతలు సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఆర్‌బీఐ పాలసీ సమీక్ష నేపథ్యంలో బ్యాంకింగ్‌ కౌంటర్లు వెలుగులో నిలిచినట్లు పేర్కొన్నారు.

బ్లూచిప్స్‌ బలిమి..: ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్, మీడియా 2.5 శాతం జంప్‌చేయగా.. ఆయిల్‌ అండ్‌ గ్యాస్, మెటల్, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఆటో, ఐటీ 0.5 శాతం బలపడగా.. ఎఫ్‌ఎంసీజీ 0.4 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో అదానీ పోర్ట్స్‌ 6 శాతం జంప్‌చేసింది. ఎన్‌టీపీసీ, అదానీ ఎంటర్, యాక్సిస్, ఎస్‌బీఐ, ఎల్‌అండ్‌టీ, అ్రల్టాటెక్, ఓఎన్‌జీసీ, సిప్లా, బీఈఎల్, శ్రీరామ్‌ ఫైనాన్స్, టాటా మోటార్స్, ఆర్‌ఐఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2.7–1 శాతం మధ్య లాభపడ్డాయి.

అయితే ఎయిర్‌టెల్, హీరోమోటో, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ 1.5–0.8 శాతం మధ్య డీలాపడ్డాయి. మార్కెట్ల బాటలో బీఎస్‌ఈలో మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ 1% ఎగశాయి.   విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు ఆపి రూ. 3,665 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయడం గమనార్హం! దేశీ ఫండ్స్‌ రూ. 251 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. 

⇒ వారాంతాన 40 శాతం ప్రీమియంతో లిస్టయిన ఎన్విరో ఇన్‌ఫ్రా ఇంజినీర్స్‌ ఇంట్రాడేలో మరో 19 శాతం జంప్‌చేసి రూ. 264ను తాకింది. చివరికి ఈ షేరు 16 % లాభంతో రూ. 258 వద్ద ముగిసింది.

⇒  గత నెల 27న లిస్టయిన ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ షేరు 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి రూ. 142 వద్ద నిలిచింది. ఈ షేరు ఐపీవో 
ధర రూ. 108.

బంపర్‌ లిస్టింగ్‌లు
సీ2సీ అడ్వాన్స్‌డ్‌  
చిన్న తరహా కంపెనీ(ఎస్‌ఎంఈ).. సీ2సీ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ బంపర్‌ లిస్టింగ్‌ సాధించింది. ఇష్యూ ధర రూ.226తో పోలిస్తే  90% ప్రీమియంతో రూ.429 వద్ద ప్రారంభమైంది.  చివరికి 99.5 శాతం లాభంతో రూ.451 వద్ద ముగిసింది.

రాజ్‌పుటానా బయోడీజిల్‌  
ఎస్‌ఎంఈ సంస్థ రాజ్‌పుటానా బయోడీజిల్‌ లిస్టింగ్‌ అదిరింది. ఇష్యూ ధర రూ. 130తో పోలిస్తే  90% ప్రీమియంతో రూ. 247 వద్ద ప్రారంభమైంది. చివరికి 99.5% లాభంతో రూ. 259 వద్ద ముగిసింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)