Breaking News

రిజిస్ట్రేషన్ విలువ.. మార్కెట్‌ విలువ

Published on Mon, 11/16/2026 - 12:28

నేను ఇల్లు విక్రయించాను. రూ. 45,00,000కు ఒప్పందం. చెక్‌ ద్వారా రూ. 24,50,000 వచ్చింది. బ్యాంకు ట్రాన్స్‌ఫర్‌ రూ. 15,00,000. నగదు రూ. 5,00,000. నేను పన్ను చెల్లించడం లేదు. ట్యాక్సబుల్‌ ఇన్‌కం రూ. 1,00,000. బేసిక్‌ లిమిట్‌ లోపలే ఉంది. నా వయస్సు 66 సంవత్సరాలు. క్యాపిటల్‌ గెయిన్స్‌ చెల్లించకుండా మినహాయింపులు దొరుకుతాయా. వివరంగా చెప్పగలరు. - వెంకటేశ్వర రావు కె.

మీ ప్రశ్నలో ఇచ్చిన సమాచారం పూర్తిగా లేదు. ఇంకొన్ని వివరాలు కావాల్సి ఉంటుంది. ఒప్పందం రూ. 45 లక్షలు అని రాశారు. చెక్కు ద్వారా వచ్చనది, డైరెక్టుగా బ్యాంకులో జమ, చేతికొచ్చిన నగదు.. ఈ మూడింటినీ కలిపితే రూ. 50,000 తేడా వస్తోంది. అలా రాకూడదు. అది అలా ఉంచితే, ఈ ఇల్లు ఏ తేదీన, ఏ ఆర్థిక సంవత్సరంలో విక్రయించారు? ఒప్పందం అంటే.. నోటి ఒప్పందమా? లేదా అగ్రిమెంట్‌ ఫర్‌ సేల్‌లో ఇంతని రాసుకున్నారా? అంటే.. రూ. 45,00,000 అని రాశారా? ఫైనల్‌గా సేల్‌ డీడ్‌లో ఎంత రాసుకున్నారు?  అంటే ఎంత మొత్తం మీద బయ్యర్‌ రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించారు? ఇదే ప్రతిఫలం అవుతుంది.

చెక్కు ద్వారా ఇచ్చనా, బ్యాంకుకి డైరెక్టుగా బదిలీ చేసినా ఎటువంటి తేడా లేదు. మిగతా మొత్తం రూ. 5,00,000 అని, అది నగదు రూపంలో ఇచ్చారని మీరు రాశారు. నగదులో పుచ్చుకోవడం నేరం. ఇన్‌కం ట్యాక్స్‌ చట్టం ప్రకారం పెనాల్టీలు పడతాయి. అడ్వాన్సుగా నగదు రూ. 20,000 లోపు తీసుకోవచ్చు. అంటే రూ. 19,999 దాటి తీసుకోరాదు. మొత్తం వ్యవహారంలో రూ. 2,00,000 దాటి తీసుకోరాదు. ఒకే ఒక గోల్డెన్‌ రూలు. నగదు ప్రసక్తే లేదు. తేవొద్దు.

అలాగే మీరు ఏ సంవత్సరంలో ఈ ఇల్లు కొన్నారు. సేల్‌ డీడ్‌లో ఎంత ప్రతిఫలం ఉంది... ఆ తర్వాత ఇంటి మీద భారీ ఖర్చులు, ఇంప్రూవ్‌మెంట్ల మీద వెచి్చంచిన మొత్తాలు.. ఈ రెండింటినీ ఇండెక్సింగ్‌ చేస్తే కొన్న ధర వస్తుంది. అమ్మిన ధర నుంచి కొన్న ధర తీసివేస్తే వచ్చేది క్యాపిటల్‌ గెయిన్స్‌. ఈ క్యాపిటల్‌ గెయిన్స్‌తో మరో ఇల్లు ఇండియలోనే కొంటే పన్ను భారం ఉండదు. లేదా ఆ మొత్తాన్ని గుర్తింపు పొందిన క్యాపిటల్‌ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేయాలి. అలా చేయడానికి పరిమితులున్నాయి. పూర్తి క్యాపిటల్‌ గెయిన్స్‌ వెచి్చంచి ఇల్లు కొంటే పన్ను భారం ఉండదు.

నేను 2011 మార్చి 9న ఒక అపార్టుమెంటు కొన్నాను. కాగితాల ప్రకారం దాని విలువ రూ. 17,67,000. ఆ ఇంటిని 2026 అక్టోబర్‌లో విక్రయించాను. కాగితాలలో రూ. 46,50,000గా రాసుకున్నాం. కానీ మార్కెట్‌ విలువ రూ. 66,84,000. పన్ను భారం ఎంత? -పీఎన్‌వీ హనుమంతరావు

కొన్న తేదీ నుంచి అమ్మిన తేదీకి మధ్య వ్యవధి రెండేళ్లు దాటింది కాబట్టి, ఇది దీర్ఘకాలిక మూలధన వ్యవహారం అవుతుంది. కాగితాల ప్రకారం చూస్తే రిజిస్ట్రేషన్ విలువ రూ. 46,50,000, 2026లో మార్కెట్‌ విలువ రూ. 66,84,000 అని అన్నారు. మీ బయ్యర్, దేనీ మిద రిజి్రస్టేషన్‌ చార్జీలు చెల్లించారు, మీకు చేతికి ఎంత వచ్చినది వివరాలు చెప్పలేదు. అంటే మీరు తక్కువకి అమ్మి, కాగితాల్లో ఎక్కువ రాసారా? లేదా ఎక్కువ పుచ్చుకుని తక్కువ రాశారా?

ఏది ఏమైనప్పటికీ అమ్మిన విలువను రూ. 66,84,000గా భావిస్తారు. 2011 మార్చి తొమ్మిదిన ఇండెక్సింగ్‌ విలువ 301. ప్రస్తుతం.. అంటే 2026–27లో 384. మీరు కొన్న విలువ రూ. 17,67,000కి మీరు చెల్లించిన రిజిస్ట్రేషన్ వ్యయాలు కలపాలి. ఇది 6 శాతం అనుకుందాం. అంటే సుమారు రూ. 1,06,000 అవుతుంది. అంటే మొత్తం రూ. 18,73,000 అవుతుంది.

ట్యాక్సేషన్‌ నిపుణులు: డా. కందాల సత్యనారాయణ మూర్తి, కె.వి.ఎన్. లావణ్య

ఇదీ చదవండి: మౌనం వీడిన రతన్ టాటా సోదరుడు.. టాటా గ్రూప్‌లో కొత్త వివాదం!

Videos

మెగా మూవీపైనే గురూజీ గురి..! గాడ్ అఫ్ వార్ ఇప్పట్లో కష్టమే..!

పులివెందులలో హై టెన్షన్.. మళ్ళీ మొదలైన దాడులు

ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. ఆరుగురు మృతి

తండ్రిని కొట్టారంటూ రెచ్చిపోయిన అక్కాచెల్లెళ్లు

గ్రాండ్ గా రోజా బర్త్ డే సెలబ్రేషన్స్

రాష్ట్ర పండుగగా రామోజీరావు జయంతి.. చంద్రబాబుకు ఇచ్చిపడేసిన కారుమూరి

అంత పొగరు ఎందుకు బ్రో? కోహ్లిని అవమానించిన అయ్యర్?

పుతిన్ 150 ఏళ్ళ ఆయుష్షు కోసం రష్యా కోతి ప్లాన్!

దూసుకొస్తున్న ఆక్వాన్ తుఫాన్.. ఏపీలో ఈ జిల్లాలకు హై అలర్ట్..

ఒంటరిగా ఉంటే..! ఈ సినిమాలు అస్సలు చూడొద్దు..!

Photos

+5

'ఓం' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

అమెరికా వీధుల్లో మృణాల్‌ ఠాకుర్‌ సందడి (ఫొటోలు)

+5

వరంగల్ : ట్రెడిషినల్‌.. సొగసు చూడతరమా..! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో హాంకాంగ్‌ ట్రిప్‌లో కాంతార హీరో రిషబ్ శెట్టి.. (ఫోటోలు)

+5

రోజా బర్త్‌ డే వేడుకల్లో ప్రముఖ సినీతారల సందడి.. (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా గద్దలకొండ గణేశ్ మూవీ హీరోయిన్ పెళ్లి.. (ఫోటోలు)

+5

మహబూబ్ నగర్ : కురుమూర్తిరాయుడి ఉద్దాల ఉత్సవం...తరలివచ్చిన భక్తులు (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : పోలీస్‌ బ్యాండ్‌ అదుర్స్‌ (ఫోటోలు)

+5

ఉపేంద్ర మేనల్లుడు-హీరో నిరంజన్ పెళ్లి (ఫొటోలు)

+5

ఇది నాకు చాలా స్పెషల్.. హీరోయిన్ దివ్యభారతి పోస్ట్ (ఫొటోలు)