Breaking News

అనిశ్చితిని ఎలా ఎదుర్కోవాలి?

Published on Mon, 05/05/2025 - 10:07

ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆదాయపన్ను నిబంధనలు అమల్లోకి వచ్చాయని విన్నాను. ఆదాయపన్ను శ్లాబుల్లో, టీడీఎస్‌ పరిమితుల్లోనూ మార్పులు చేసినట్టు తెలిసింది. సీనియర్‌ సిటిజన్‌గా (60 ఏళ్లకు పైన) నాకు డెట్‌ సాధనాలపై వస్తున్న వడ్డీ ఆదాయమే ప్రధానంగా ఉంది. కాబట్టి ఆదాయపన్ను మార్పుల ప్రభావం నాపై ఏ మేరకు ఉంటుంది?  – వినోద్‌ బాబు

కొత్త విధానం కింద ఆదాయపన్ను శ్లాబుల్లో, టీడీఎస్‌లో మార్పులు చోటుచేసుకున్నాయన్నది నిజమే. టీడీఎస్‌ పరిమితిని సీనియర్, నాన్‌ సీనియర్‌ సిటిజన్లకూ (60 ఏళ్లలోపు) తగ్గించారు. సీనియర్‌ సిటిజన్స్‌కు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 వరకు వడ్డీ ఆదాయంపై టీడీఎస్‌ మినహాయింపు ఉంది. ఇప్పుడు ఈ పరిమితి రూ.లక్షకు పెరిగింది. ఆదాయం ఈ లోపు ఉంటే టీడీఎస్‌ వర్తించదు. నాన్‌ సీనియర్‌ సిటిజన్స్‌కు రూ.40,000గా ఉన్న పరిమితి రూ.50,000కు పెరిగింది. అంటే వడ్డీ ఆదాయం రూ.50వేలు మించినప్పుడే టీడీఎస్‌ వర్తిస్తుంది. అద్దె ఆదాయంపై టీడీఎస్‌ అమలును రూ.2.4 లక్షల పరిమితి నుంచి రూ.6లక్షలకు పెంచారు. ఇది పన్ను చెల్లింపుదారులందరికీ వర్తిస్తుంది. మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి వచ్చే డివిడెండ్‌ ఆదాయం రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచారు. అంటే ఫండ్స్‌ నుంచి డివిడెండ్‌ ఆదాయం రూ.10,000 మించినప్పుడే టీడీఎస్‌ అమలవుతుంది. కొత్త పన్ను విధానంలో ఆదాయపన్ను శ్లాబుల్లోనూ మార్పులు జరిగాయి. మొత్తం ఆదాయం రూ.12లక్షల వరకు ఉంటే సెక్షన్‌ 87ఏ కింద రాయితీ ప్రయోజనంతో ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. స్టాక్స్, ఈక్విటీ ఫండ్స్‌ నుంచి వచ్చే మూలధన లాభాలు కూడా రూ.12 లక్షల ఆదాయంలోపే ఉన్నప్పటికీ.. మూలధన లాభాలపై విడిగా పన్ను చెల్లించడం తప్పనిసరి.  

ఇదీ చదవండి: రేట్ల తగ్గింపు ప్రతికూలం!

మార్కెట్లు అస్థిరతంగా ఉన్నాయి. ఈ పరిస్థితులను ఇన్వెస్టర్లు ఎలా ఎదుర్కోవాలి? – ఉష

మార్కెట్లలో అస్థిరతలు సహజమే. ఇప్పుడనే కాదు.. గతంలోనూ ఎన్నో సందర్భాల్లో ఇలాంటి ఆటుపోట్లను చూశాం. భవిష్యత్తులో మరింత ఎక్కువగా ఉండొచ్చు. గడిచిన ఐదు, పదేళ్ల కాలంలో ఇదే ధోరణి కనిపిస్తోంది. వీటిని ఎదుర్కొనే విధంగా ఇన్వెస్టర్ల పెట్టబడుల ప్రణాళిక ఉండాలి. ఇందుకోసం కొన్ని చర్యలను అమల్లో పెట్టాల్సి ఉంటుంది. ముందుగా లైఫ్‌ ఇన్సూరెన్స్, హెల్త్‌ ఇన్సూరెన్స్‌తో కుటుంబానికి ఆర్థిక, ఆరోగ్య రక్షణ కలి్పంచుకోవాలి. ఊహించని అవసరాలు ఏర్పడితే ఈక్విటీ పెట్టబడులపై ఆధారపడకుండా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఇన్వెస్ట్‌ చేస్తున్న పెట్టుబడులు కనీసం ఐదు నుంచి పదేళ్లు అంతకంటే ఎక్కువ కాలానికి అయి ఉండాలి. దీంతోపాటు క్రమం తప్పకుండా మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా అస్థిరతల నుంచి గరిష్ట ప్రయోజనాన్ని పొందొచ్చు. రెగ్యులర్‌గా ఇన్వెస్ట్‌ చేసే వారికి మార్కెట్‌ కరెక్షన్లలో మంచి పెట్టుబడుల అవకాశాలు వస్తుంటాయి. వీటిని అనుకూలంగా మలుచుకోవచ్చు. మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే చౌక ధరల వద్ద కొనుగోలు చేసుకోవచ్చు. తద్వారా దీర్ఘకాలంలో రాబడులను పెంచుకోవచ్చు.

ధీరేంద్ర కుమార్‌

సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)