Breaking News

బ్యాంకింగ్, రిలయన్స్‌ ర్యాలీ

Published on Wed, 01/08/2025 - 01:03

ముంబై: బ్యాంకులు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(2%) షేర్ల ర్యాలీతో స్టాక్‌సూచీలు రెండు రోజుల నష్టాల నుంచి గట్టెక్కాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు  అందడంతో సెన్సెక్స్‌ 234 పాయింట్లు పెరిగి 78,199 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 92 పాయింట్లు బలపడి 23,708 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు ట్రేడింగ్‌ ప్రారంభంలో కాస్త అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. వెంటనే తేరుకొని రోజంతా పరిమిత శ్రేణిలో లాభాల్లో కదలాడాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 488 పాయింట్లు ఎగసి 78,453 వద్ద, నిఫ్టీ 179 పాయింట్లు పెరిగి 23,795 వద్ద గరిష్టాన్ని తాకాయి. బ్యాంకింగ్‌ షేర్లతో పాటు ఇంధన, ఆయిల్‌అండ్‌గ్యాస్, ఇండ్రస్టియల్, కమోడిటీ, సర్విసెస్‌ షేర్లకూ కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ ఒకశాతం, స్మాల్‌ క్యాప్‌ సూచీ 2% రాణించాయి.  

ఇండోఫార్మ్‌ ఎక్విప్‌మెంట్‌ హిట్‌
ఇండోఫార్మ్‌ ఎక్విప్‌మెంట్‌ షేరు బీఎస్‌ఈలో ఇష్యూ ధర (రూ.215)తో పోలిస్తే 20% ప్రీమియంతో రూ.258 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 33% ర్యాలీ రూ.287 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 27% లాభంతో రూ.273 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.1,310.37 కోట్లుగా నమోదైంది. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)