Breaking News

రూ.5 కోట్ల వాచ్‌తో జుకర్‌బర్గ్‌.. ప్రత్యేకతలివే..

Published on Wed, 12/11/2024 - 17:58

మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కంపెనీ ఏఐ లామాకు సంబంధించిన విషయాలను ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో ద్వారా షేర్ చేసుకున్నారు. అయితే ఆ వీడియోలో తాను ధరించిన వాచ్‌పై నెట్టింట చర్చ జరిగింది. ప్రపంచంలోనే అత్యంత సన్నని వాచ్‌ను మార్క్‌ ధరించినట్లు నెటిజన్లు గుర్తించారు. ఈ బల్గారి ఆక్టో ఫినిసిమో ఆల్ట్రా సీఓఎస్‌సీ(Bulgari Octo Finissimo Ultra COSC) మోడల్‌ వాచ్‌ కేవలం 1.7 మిల్లీమీటర్‌ మందంతో ఉంటుంది. అంటే దాదాపు రెండు క్రెడిట్ కార్డ్‌ల మందం కంటే సన్నగా ఉంటుంది.

ఈ వాచ్‌ ప్రత్యేకతలు..

  • ఈ వాచ్‌ కేవలం 1.7 మిమీ మందంతో ఉంటుంది.

  • ఈ వాచ్ బీవీఎల్ 180 క్యాలిబర్‌తో గంటకు 28,800 వైబ్రేషన్స్ (4 హెర్ట్జ్) ఫ్రీక్వెన్సీతో మాన్యువల్ వైండింగ్ మూవ్‌మెంట్‌ను కలిగి ఉంటుంది.

  • ఈ గడియారాన్ని సాండ్‌బ్లాస్టెడ్‌ టైటానియంతో తయారు చేశారు. వాచ్‌ పట్టీలు కూడా పూర్తిగా టైటానియంతోనే రూపొందించారు. కాబట్టి ఇది చాలా ఏళ్లు మన్నికగా ఉంటాయి. దాంతోపాటు తేలికపాటి డిజైన్ దీని సొంతం.

  • ఇది COSC సర్టిఫైడ్ గడియారం. అంటే ఇది కఠినమైన కచ్చితత్వ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.

  • ఈ వాచ్ లిమిటెడ్‌ ఎడిషన్‌. ప్రపంచంలో ఇవి 20 మాత్రమే ఉ‍న్నాయి. అందుకే ఇది అంత ప్రత్యేక సంతరించుకుంది.

  • దీని ధర సుమారు 5,90,000 అమెరిన్‌ డాలర్లు. అంటే రూ.5 కోట్లకు పైనే.

లామా 3 కంటే పది రెట్లు ఎక్కువ

జుకర్‌బర్గ్‌ పోస్ట్‌ చేసిన వీడియోలో మాట్లాడుతూ.. మెటా ఏఐ లామా 4 వెర్షన్‌ను 2025 ప్రారంభంలో విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఇది తదుపరి తరం ఏఐ మోడల్ అని, లామా 3 కంటే ఇది మరింత మెరుగ్గా పని చేస్తుందన్నారు. ఇందులో రీజనింగ్‌ వ్యవస్థ సమర్థంగా పని చేస్తుందని చెప్పారు. లామా 4కు సుమారు 1,60,000 జీపీయూలు(గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్- కంప్యూటర్లు, గేమింగ్ కన్సోల్స్ కోసం చిత్రాలు, వీడియోలను రియల్ టైమ్‌లో అందించడానికి ఇది ఉపయోగపడుతుంది) అవసరమని భావిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది లామా 3 కంటే పది రెట్లు ఎక్కువ.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)