Breaking News

ఎగుమతులు మళ్లీ ప్లస్‌

Published on Wed, 04/16/2025 - 03:51

న్యూఢిల్లీ: వస్తు ఎగుమతులు నాలుగు నెలల తర్వాత సానుకూలంగా మారాయి. మార్చి నెలలో 0.7 శాతం వృద్ధితో 41.97 బిలియన్‌ డాలర్లకు (రూ.3.6 లక్షల కోట్లు సుమారు) చేరాయి. వాణిజ్య లోటు 21.54 బిలియన్‌ డాలర్లకు విస్తరించినట్టు ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద వస్తు ఎగుమతులు 0.08 శాతం పెరిగి 437.42 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

దిగుమతులు 6.67 శాతం పెరిగి 720.24 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. దీంతో వాణిజ్య లోటు గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి 283 బిలియన్‌ డాలర్లకు పెరిగిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వాణిజ్య లోటు 14.05 బిలియన్‌ డాలర్లు కాగా.. గతేడాది మార్చిలో 15.33 బిలియన్‌ డాలర్ల చొప్పున ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య లోటు 241 బిలియన్‌ డాలర్లుగా ఉండడాన్ని గమనించొచ్చు. దిగుమతులు ఈ ఏడాది మార్చిలో నాలుగు నెలల గరిష్టానికి చేరి 63.51 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.  

సేవల్లో వృద్ధి.. 
ఇక 2024–25 సంవత్సరంలో వస్తు, సేవల ఎగుమతులు అన్నీ కలసి 821 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నట్టు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2023–24లో నమోదైన 778 బిలియన్‌ డాలర్లతో పోల్చి చూస్తే 5.5 శాతం వృద్ధి నమోదైనట్టు తెలుస్తోంది. 2023–24లో సేవల ఎగుమతులు 341 బిలియన్‌ డాలర్లు కాగా, 2024–25లో 383.51 బిలియన్‌ డాలర్లకు పెరిగినట్టు అంచనా. 

2023–24తో పోల్చితే 2024–25లో ఇంజనీరింగ్‌ ఎగుమతులు 109.3 బిలియన్‌ డాలర్ల నుంచి 117 బిలియన్‌ డాలర్లకు, ఎల్రక్టానిక్స్‌ ఎగుమతులు 29 బిలియన్‌ డాలర్ల నుంచి 38 బిలియన్‌ డాలర్లకు, ఫార్మా ఎగుమతులు 28 బిలియన్‌ డాలర్ల నుంచి 30.47 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. పెట్రోలియం ఉత్పత్తులు (63.34 బిలియన్‌ డాలర్లు) కెమికల్స్‌ రంగాల్లో (28.7 బిలియన్‌ డాలర్లు) ఎగుమతులు క్షీణించాయి.

Videos

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)