Breaking News

స్వల్ప యాంటీబయాటిక్ చికిత్సతోనే నవజాత ఇన్ఫెక్షన్లు నయం

Published on Sun, 10/19/2025 - 19:55

హైదరాబాద్‌: స్వల్పకాలిక యాంటీబయాటిక్ చికిత్సలతోనే నవజాత శిశువుల్లో ఇన్ఫెక్షన్లను నయం చేయొచ్చని శిశు వైద్య నిపుణులు చేసిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. హైదరాబాద్‌ ఫెర్నాండెజ్ హాస్పిటల్‌కి చెందిన డా. సాయికిరణ్.డితో సహా భారతీయ నియోనాటాలజీ నిపుణుల బృందం ప్రముఖ జ‌ర్న‌ల్‌ ‘లాన్సెట్ క్లినికల్ మెడిసిన్‌’‌లో కీలక అధ్యయనాన్ని ప్రచురించింది. సాధారణంగా తీవ్రమైన నవజాత ఇన్ఫెక్షన్లకు 10–14 రోజుల యాంటీబయాటిక్ చికిత్సలు చేయాల్సి ఉంటుంది. కానీ వీటిలో చాలావాటిని 7 రోజుల స్వల్ప కాలిక చికిత్సలతోనే నయం చేయొచ్చని ఈ అధ్యయనంలో తేల్చారు.

అధికంగా లేదా ఎక్కువకాలం యాంటీబయాటిక్స్‌ వాడకం ద్వారా వ్యాధికారక బ్యాక్టీరియా ప్రతిరోధకత పెరగడంతోపాటు దీర్ఘకాలం ఆసుపత్రిలో ఉండాల్సి రావడం, దీంతో ఖర్చులు పెరగడం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ప్రత్యేకంగా అకాల లేదా అనారోగ్యంతో జన్మించిన శిశువులు ఎక్కువగా యాంటీబయాటిక్స్‌కు లోనవుతున్నారు.

శిశువుల ఇన్ఫెక్షన్లపై స్వల్ప కాలిక, దీర్ఘకాలిక యాంటీబయాటిక్ చికిత్సల ప్రభావాన్ని ఈ అధ్యయనంలో విశ్లేషించారు. ముఖ్యంగా “బయోమార్కర్స్” ఆధారంగా చికిత్స కొనసాగింపును నిర్ణయించడం మెరుగైన ఫలితాలను ఇచ్చిందని పేర్కొన్నారు. రక్త పరీక్షల ద్వారా సంక్రమణ తగ్గుతుందా లేదా అన్న విషయాన్ని గమనించి, అవసరమైనప్పుడు చికిత్స ఆపడం సాధ్యమవుతుంది.

అధ్యయన ఫలితాల్లో కీలకాంశాలు

  • 10–14 రోజుల చికిత్సల స్థానంలో 7 రోజుల స్వల్పకాలిక చికిత్స చాలా సందర్భాల్లో సరిపోతుందని తేలింది.

  • “బయోమార్కర్” పరీక్షలు చికిత్స నిర్ణయానికి సహాయపడతాయి.

  • అయితే 3–4 రోజుల చికిత్సకు, 5–7 రోజుల చికిత్స మధ్య తేడాపై స్పష్టమైన ఆధారాలు లేవు. ఈ అంశంలో ఇంకా పరిశోధన అవసరం.

  • మూత్ర సంక్రమణ, మెనింజైటిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్లపై మరింత స్పష్టత అవసరం.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)