Breaking News

ఏకకాలంలో ఎన్నోపనులు..!

Published on Wed, 05/15/2024 - 11:28

ఒకేసమయంలో రెండు పనులు చేయడం సాధ్యమా.. అని అడిగితే చాలా కష్టమని చెబుతాం. కానీ క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో క్యూబిట్స్‌ ఏకకాలంలో చాలా పనులు చేయగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ విషయాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

నిత్యం టెక్నాలజీలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అన్నిరంగాల్లో అందరికంటే ముందుండాలనే భావనతో వేగంగా పనిచేయాలనుకుంటున్నారు. అందుకు తగ్గుట్టు ప్రముఖ కంపెనీలు సాంకేతిక పరికరాలు తయారుచేస్తున్నాయి. వాటిలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ టెక్నాలజీను వాడే పరికరాలకు సమీప భవిష్యత్తులో గిరాకీ ఏర్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

ఈ ఏడాదిలో డేటా అనలిటిక్స్‌, కృత్రిమ మేధ రంగాలను క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ గణనీయంగా మలుపు తిప్పగలదని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మానవ పురోగమనాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం వాడుతున్న కంప్యూటింగ్‌ టెక్నాలజీ కంటే క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ ఎన్నోరెట్లు సమర్థంగా, వేగంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఎలా పనిచేస్తుందంటే..

ఇది ఎంటాంజిల్‌మెంట్‌, సూపర్‌పొజిషన్స్‌ అనే అంశాల మూలంగా ఒకే సమయంలో వేలసంఖ్యలో గణనలు చేయగలదు. సంప్రదాయ కంప్యూటర్లు బైనరీ బిట్స్‌..అంటే 0 లేదా 1 రూపంలో సమాచారాన్ని నిల్వ చేసుకుంటాయి. దాన్ని విశ్లేషిస్తాయి. అదే క్వాంటమ్‌ కంప్యూటర్లు క్యూబిట్స్‌ సాయంతో పనిచేస్తాయి. ఇవి 1, 0.. లేదా ఒకే సమయంలో రెండు రూపాల్లోనూ ఉండొచ్చు. అంటే ఒక పని పూర్తి కాకుండానే మరో పనిని మొదలు పెడుతాయి. ఒకే సమయంలో రెండు పనులనూ చేస్తాయి.

ఇదీ చదవండి: 100 విమానాలు కొనుగోలు చేయనున్న ఇండిగో.. ఎందుకంటే..

క్వాంటమ్‌ రేణువులు ఎంటాంజిల్‌మెంట్‌ అనే విచిత్రమైన ప్రవర్తనను ప్రదర్శిస్తాయి. ఎంటాంజిల్‌ అయినప్పుడు అవి ఎంత దూరంలో ఉన్నా ఒకదాంతో మరోటి అనుసంధానమవుతాయి. అదీ లక్షలాది మైళ్ల దూరంలో ఉన్నాసరే ఎంటాంజిల్‌ అవుతాయి. ఈ ప్రక్రియలో క్యూబిట్ల సంఖ్యను పెంచితే క్వాంటమ్‌ పరికరాల సామర్థ్యం అనూహ్యంగా పెరిగిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ పరిజ్ఞానం ప్రయోగశాలలను దాటుకొని వాడకానికి దగ్గరవుతోంది. మందుల ఆవిష్కరణ, క్రిప్టోగ్రఫీ, వాతావరణ శాస్త్రం, పదార్థ విజ్ఞానం వంటి ఎన్నో రంగాల్లో ఇది సంచలన మార్పులకు కారణం కాగలదని భావిస్తున్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)