సేవల రంగం .. స్వల్పంగా మెరుగు

Published on Wed, 05/07/2025 - 10:09

కొత్త ఆర్డర్ల రాకతో దేశీ సర్వీసుల రంగం ఏప్రిల్‌లో స్వల్పంగా మెరుగుపడింది. దీంతో సేవల రంగం పనితీరుకు ప్రామాణికంగా పరిగణించే హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వీసెస్‌ పీఎంఐ బిజినెస్‌ యాక్టివిటీ సూచీ గత నెలలో 58.7కి చేరింది. మార్చిలో ఇది 58.5గా నమోదైంది. పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) పరిభాషలో సూచీ 50కి ఎగువన ఉంటే వృద్ధిని, దిగువన ఉంటే క్షీణతను సూచిస్తుంది.

తాజా గణాంకాలు, దీర్ఘకాలిక సగటు అయిన 54.2 స్థాయికన్నా అధికంగానే ఉన్నట్లు హెచ్‌ఎస్‌బీసీ చీఫ్‌ ఇండియా ఎకానమిస్ట్‌ ప్రాంజల్‌ భండారీ తెలిపారు. మార్చిలో కాస్త నెమ్మదించిన ఎగుమతి ఆర్డర్లు ఏప్రిల్‌లో తిరిగి పుంజుకున్నట్లు వివరించారు. ఆసియా, యూరప్, 
మధ్యప్రాచ్యం, అమెరికావ్యాప్తంగా భారతీయ కంపెనీల సేవలకు డిమాండ్‌ నెలకొన్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: జీడీపీ వృద్ధి 6.3 శాతమే! కారణం..

సగటు విక్రయ ధరలను పెంచడం ద్వారా సర్వీసుల కంపెనీలు తమ అధిక వ్యయాల భారాన్ని క్లయింట్లకు బదలాయించినట్లు పీఎంఐ సర్వేలో వెల్లడైంది. వ్యయాలపరంగా ఒత్తిళ్లు తగ్గి, రేట్లను పెంచడంతో మార్జిన్లు మెరుగుపడ్డాయి. కార్యకలాపాలు పుంజుకోవడంపై సర్వీస్‌ ప్రొవైడర్లు ఆశావహంగా ఉన్నప్పటికీ అంచనాలు మాత్రం తగ్గాయి.
 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)