Breaking News

అంబానీ ఇంటిని తలదన్నే ఇల్లు!! బెంగళూరులో..

Published on Wed, 07/17/2024 - 20:17

దేశంలో అత్యంత ఖరీదైన ఇల్లు ఏది అంటే టక్కున ముఖేష్‌ అంబానీది అనే చెప్పేస్తారు. ముంబైలో ఉన్న ఈ విలాసవంతమైన నివాసం పేరు ‘యాంటిలియా’. అయితే దీనిని తలదన్నే మ్యాన్షన్‌ బెంగళూరులో ఉంది. అది ఎవరిది.. దాని విలువ ఎంత.. ఇతర విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం..

400 అడుగుల ఎత్తు.. 33 అంతస్తుల లగ్జరీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్.. దానిపైన మ్యాన్షన్. రెండు అంతస్తుల్లో ఉన్న ఈ స్కై మ్యాన్షన్‌లో ఉన్న విలాసవంతమైన సదుపాయాల గురించి తెలిస్తే నోరెల్లబెడతారు. హెలిప్యాడ్, లష్ గార్డెన్స్, ఇన్ఫినిటీ స్విమ్మింగ్ పూల్, 360 డిగ్రీ వ్యూయింగ్ డెక్‌తో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.

ప్రస్తుతం విదేశాలకు పరారైన, లిక్కర్‌ కింగ్‌గా పేరొందిన విజయ్‌ మాల్యాకు చెందిందే ఈ విలాసవంతమైన భవనం. కింగ్‌ఫిషర్ టవర్స్‌గా పిలిచే ఈ అపార్ట్‌మెంట్ బ్లాక్‌ను మాల్యా పూర్వీకుల ఇల్లు ఉండే 4.5 ఎకరాల స్థలంలో నిర్మించారు. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్‌ దీన్ని నిర్మించింది. ఈ ఇంటి విలువ 20 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.

ఒక్క రోజు కూడా ఉండలేదు
ఇక అంబానీ కుటుంబానికి చెందిన ముంబై టవర్, యాంటిలియా దేశంలోని అత్యంత సంపన్నుల యాజమాన్యంలో ఉన్న మరో అద్భుతమైన ఇల్లు . దీని నిర్మాణానికి 2 బిలియన్ ఖర్చయినట్లు అంచనా. విలువపరంగా చూస్తే కింగ్‌ఫిషర్‌ టవర్స్‌ విలువ తక్కువే అయినా అంబానీ నివాసం 27 అంతస్తులు ఉంటే.. మాల్యా మ్యాన్షన్‌ ఉండే టవర్స్‌ 33 అంతస్తుల్లో ఉంది. అయితే ముచ్చట పడి కట్టించుకున్న ఈ మ్యాన్షన్‌లో విజయ్‌ మాల్యా ఒక్క రోజు కూడా ఉండలేదు. ఇది ఇంకా నిర్మాణంలో ఉండగానే బ్యాంకులకు రుణాల ఎగవేత వ్యవహారంలో ఆయన దేశం వదిలి పారిపోయారు.

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)