Breaking News

వెకేషన్‌కు వెళ్లాడు.. ఉద్యోగం పోయింది!

Published on Sun, 07/19/2026 - 17:26

ఉద్యోగం పోయిందని లేదా తొలగించిందనే విషయం.. సాధారణంగా కంపెనీ నుంచి వచ్చే అధికారిక సమాచారం ద్వారా తెలుస్తుంది. కానీ.. ఓ 31 ఏళ్ల వ్యక్తికి మాత్రం తన ఉద్యోగం కోల్పోయిన విషయం చాలా విచిత్రమైన రీతిలో తెలిసిందని పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన ఒక సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

రెడ్డిట్‌లో తన అనుభవాన్ని పంచుకున్న ఆ వ్యక్తి.. నా ఉద్యోగం ముగిసిందని కంపెనీ నుంచి ఎలాంటి ముందస్తు సమాచారం రాలేదని వెల్లడించాడు. అయితే.. తనకు తెలియకుండానే ఆఫీస్ మెయిల్‌లోని 'అవుట్ ఆఫ్ ఆఫీస్' రిప్లైను మార్చారని చెప్పాడు. అందులో తాను ఇక కంపెనీలో ఉద్యోగి కాదని, తనను సంప్రదించాలనుకునే వారు మేనేజర్‌ను సంప్రదించాలని పేర్కొన్నట్లు వివరించాడు.

నిజానికి అతడు సెలవుల్లో ఉన్న సమయంలో.. మేనేజర్ నుంచి అకస్మాత్తుగా ఒక కాల్‌లో పాల్గొనాలని మెసేజ్ వచ్చింది. అయితే.. వేరే టైమ్ జోన్‌లో ఉండటం, ఇంటర్నెట్ సమస్యల కారణంగా ఆ కాల్‌కు హాజరు కాలేనని చెప్పాడు. దీనికి తన మేనేజర్ 'మీ సెలవులను కొనసాగించండి' అని చెప్పాడు. ఇదే తన ఉద్యోగానికి ఎసరుపెడుతుందని ఊహించలేకపోయానని చెప్పాడు. ఎందుకంటే తన మేనేజర్ చెప్పిన మాటల్లో కూడా ఉద్యోగం ప్రమాదంలో ఉందనే విషయం గ్రహించలేకపోయానని స్పష్టం చేసాడు.

ఉద్యోగం పోయిందనే విషయం తన చాలా ఆశ్చర్యంగా అనిపించిందని అతను చెప్పాడు. ఎందుకంటే జనవరిలోనే తనకు ప్రమోషన్ వచ్చిందని, తన పనితీరుపై సహచరులు, ఉన్నతాధికారుల నుంచి మంచి అభిప్రాయాలు ఉన్నాయని తెలిపాడు. అంతేకాకుండా.. కొద్ది రోజుల ముందు తన బాస్‌తో కలిసి భోజనం కూడా చేశాను. అప్పుడు కూడా ఉద్యోగం కోల్పోయే ఎలాంటి సంకేతాలు కనిపించలేదని వెల్లడించాడు.

సెలవులు ముగిసిన తర్వాత ఏం చేయాలో తెలియక అతను రెడ్డిట్‌లో సలహాలు కోరాడు. తన పరిస్థితి అర్థం కావడం లేదని, షాక్‌లో ఉన్నానని చెప్పాడు. దీనిపై స్పందించిన చాలామంది నెటిజన్లు అతనికి మద్దతుగా నిలిచారు.

ఉద్యోగానికి సంబంధించిన అన్ని ఈమెయిల్స్, మెసేజ్‌లు, ఆధారాలను భద్రపరచుకోవాలని కొందరు సూచించారు. మరికొందరు మాత్రం మిగిలిన సెలవులను ప్రశాంతంగా గడపాలని, పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోవాలని సలహా ఇచ్చారు.

ఈ ఘటన ఉద్యోగులను తొలగించే విధానంపై మరోసారి చర్చకు దారితీసింది. ఉద్యోగం నుంచి తొలగించడం కంపెనీలకు అవసరమైన నిర్ణయం అయినప్పటికీ.. సెలవుల్లో ఉన్న ఉద్యోగికి ఈ విధంగా విషయం తెలియజేయడం సరైన పద్ధతి కాదని పలువురు అభిప్రాయపడ్డారు. ఉద్యోగులతో కంపెనీలు మరింత పారదర్శకంగా, గౌరవంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: లెక్కల్లో 51 మార్కులే.. కట్ చేస్తే రూ.వేల కోట్ల కంపెనీ!: ఎవరీ పవన్ కుమార్ చందన?

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)