Breaking News

ఫ్లైట్‌లో బీడీ పొగ..

Published on Wed, 05/17/2023 - 18:02

Smoking Beedi inside Flight: విమానంలో బీడీ తాగిన ఓ వ్యక్తిని బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. ఫ్లైట్‌లో బీడీ ఎందుకు తాగావని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పాడు ఆ వ్యక్తి.

ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్‌టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ!

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. 56 ఏళ్ల ఎం.ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి అహ్మదాబాద్ నుంచి ఆకాశ ఎయిర్ విమానంలో బెంగళూరు నగరానికి వస్తున్నాడు.  వాష్‌రూమ్‌లో బీడీ తాగుతుండగా విమాన సిబ్బంది పట్టుకున్నారు.  బెంగళూరులో దిగగానే ఎయిర్‌ ప్లేన్‌ డ్యూటీ మేనేజర్  విమానాశ్రయ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పోలీసులు అతన్ని అరెస్ట్‌  చేసి బెంగళూరు సెంట్రల్ జైలుకు తరలించారు.

‘రైలులో తాగినట్లే విమానంలోనూ తాగాను’
తాను ఎక్కువగా రైలులో ప్రయాణిస్తానని, విమానంలో ప్రయాణించడం తనకు తొలిసారి అని పోలీసులకు నిందితుడు తెలిపాడు. రైలు టాయిలెట్ లో బీడీ తాగినట్లే విమానంలోనూ తాగానని అమాయకంగా చెప్పాడు. మార్వార్‌లో కార్మికుడిగా పనిచేస్తున్న కుమార్ మరో వ్యక్తితో కలిసి బెంగళూరులో బంధువు మరణానంతర కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చాడని పోలీసు అధికారులు తెలిపారు. ఇలా బీడీ తాగిన వ్యక్తిని అరెస్టు చేయడం బెంగుళూరు విమానాశ్రయంలో ఇదే తొలిసారి. గతంలో విమానంలో సిగరెట్ తాగిన ఇద్దరు వ్యక్తులపై ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: బంఫరాఫర్‌: వైజాగ్‌ నుంచి సింగపూర్‌ విమాన టికెట్‌ ఎంతో తెలుసా?

Videos

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

Photos

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు