Make in India: ‘టెస్లా వస్తే రానీ.. కానీ దాన్ని మాత్రం మార్చొద్దు’

Published on Mon, 12/11/2023 - 08:16

దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన మేకిన్‌ ఇండియా పాలసీ నిలకడగా ఉండాలని, ఏ ఒక్క సంస్థ కోసమో దాన్ని మార్చేయరాదని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ఈవీ కమిటీ చైర్‌పర్సన్‌ సులజ్జా ఫిరోదియా మోత్వానీ వ్యాఖ్యానించారు. భారత్‌లో విద్యుత్‌ కార్ల తయారీ  ఇన్వెస్ట్‌ చేయాలంటే కొన్నాళ్ల పాటు తమ వాహనాల దిగుమతి సుంకాలను తగ్గించాలంటూ అమెరికన్‌ సంస్థ టెస్లా.. కేంద్రానికి ప్రతిపాదించిన నేపథ్యంలో మోత్వానీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

‘ఎవరో దేశీయంగా తయారీపై ఇన్వెస్ట్‌ చేస్తామన్నంత మాత్రాన .. ప్రభుత్వం అమలు చేస్తున్న మేకిన్‌ ఇండియా విధానాలను మార్చడం సరికాదు. ఒక విధానం ఉందని, దాన్ని పాటించాల్సిందేనని అందరూ గుర్తెరగాలి. టెస్లా సమర్పించిన ప్రతిపాదన గురించి నాకు పూర్తిగా తెలియదు. కానీ పాలసీ విషయంలో గందరగోళం ఉండకూడదని, నిలకడగా ఉండాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం‘ అని ఆమె వివరించారు.  

భారత్‌ కచ్చితంగా మేకిన్‌ ఇండియాపై దృష్టి పెట్టినప్పుడే దీర్ఘకాలికంగా పోటీతత్వం పెరగగలదని పేర్కొన్నారు. అలా జరగకపోతే ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కోసం విడిభాగాలన్నింటినీ దిగుమతే చేసుకోవాల్సి వస్తుందన్నారు. మరోవైపు, వ్యక్తిగత అవసరాలకు కొనుగోలు చేసే చిన్న ఎలక్ట్రిక్‌ కార్లకు కూడా ఫేమ్‌ స్కీమును (విద్యుత్‌ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు సబ్సిడీలిచ్చే పథకం) వర్తింపచేయాలని కేంద్రాన్ని కోరినట్లు మోత్వానీ తెలిపారు.

ఇదీ చదవండి: ఆ దేశంలోనే అధిక ద్రవ్యోల్బణం ..!

రూ. 20 లక్షల వరకు ఖరీదు చేసే కార్లకు దీన్ని వర్తింపచేసే అంశాన్ని పరిశీలించాలని ఫేమ్‌ మూడో విడతపై ఫిక్కీ సమరి్పంచిన సిఫార్సుల్లో పేర్కొన్నట్లు ఆమె వివరించారు. ప్రస్తుతం వ్యక్తిగత ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలు, ప్రభుత్వ.. వాణిజ్య రవాణా అవసరాలకు ఉపయోగించే త్రిచక్ర వాహనాలు, ఫోర్‌ వీలర్లు, ఎలక్ట్రిక బస్సులకు ఫేమ్‌ స్కీము వర్తిస్తోంది.

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)