Breaking News

అనిల్‌ అంబానీకి మళ్లీ భారీ ఎదురుదెబ్బ!

Published on Fri, 11/15/2024 - 13:12

ఆర్థిక కష్టాలు తొలగిపోతున్నాయి.. అప్పులన్నీ దాదాపుగా తీరిపోయాయి.. నష్టాలు పోయి లాభాలు కూడా పలకరించాయి. ఇ​క అంతా ఆనందమే అనుకుంటున్న సమయంలో రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్‌ అంబానీకి మళ్లీ భారీ ఎదురుదెబ్బ తగిలింది.

నకిలీ బ్యాంక్ గ్యారెంటీని సమర్పించారంటూ  రిలయన్స్ పవర్‌కి, దాని అనుబంధ సంస్థకు భారత క్లీన్ ఎనర్జీ ఏజెన్సీ ఎస్‌ఈసీఐ షోకాజ్ నోటీసు పంపింది. సంస్థలపై క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ సంజాయిషి కోరింది.

రిలయన్స్ పవర్‌కు చెందిన ఒక యూనిట్ విదేశీ బ్యాంక్ గ్యారెంటీకి సంబంధించిన నకిలీ ఎండార్స్‌మెంట్‌ను సమర్పించిందనే ఆరోపణలపై రిలయన్స్ పవర్‌ను, దాని యూనిట్‌ను మూడేళ్లపాటు వేలంలో పాల్గొనకుండా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SECI) గత వారం నిషేధించింది.

రిలయన్స్ పవర్‌కు అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ ఎన్‌యూ బీఈఎస్ఎస్ సమర్పించిన బ్యాంక్ గ్యారెంటీ కూడా నకిలీదని ఎస్‌ఈసీఐ తన నవంబర్ 13 నాటి నోటీసులో పేర్కొంది. ఈ చర్య తర్వాత, గురువారం బీఎస్‌ఈలో రిలయన్స్ పవర్ షేర్లు 1.53 శాతం పడిపోయి రూ.36 వద్ద స్థిరపడ్డాయి.

కాగా ఆరోపణలపై రిలయన్స్ పవర్ స్పందిస్తూ.. "మోసం, ఫోర్జరీ, కుట్రలో  బాధితులం" అని పేర్కొంది. “దీనికి సంబంధించి ఇప్పటికే థర్డ్ పార్టీపై అక్టోబర్ 16న ఢిల్లీ పోలీస్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్‌లో క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేశాం. దాని ఆధారంగా నవంబర్ 11న ఎఫ్‌ఐఆర్ నమోదైంది. విషయం దర్యాప్తు పరిధిలో ఉంది. న్యాయ ప్రక్రియ కొనసాగుతుంది” అని రిలయన్స్ పవర్ తెలిపింది.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)