Breaking News

ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపనున్న థార్ 5 డోర్ - లాంచ్ ఎప్పుడంటే?

Published on Sat, 06/24/2023 - 15:18

Mahindra Thar 5 Door: దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' (Mahindra & Mahindra) మార్కెట్లో కొత్త 'థార్ 5 డోర్' కారుని విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్న సంగతి తెలియసిందే. అయితే రానున్న భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగష్టు 15న గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించడానికి మూహూర్తం ఖరారు చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

థార్ 5 డోర్
నివేదికల ప్రకారం.. మహీంద్రా 5 డోర్ థార్ ఆఫ్-రోడర్ దక్షిణాఫ్రికాలో జరగనున్న ఒక ఈవెంట్‌లో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. కాగా వచ్చే ఏడాది నాటికి ఇది భారతీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహీంద్రా తన ఎక్స్‌యువి300, ఎక్స్‌యువి700, స్కార్పియో ఎన్ వంటి ఆధునిక ఉత్పత్తులను దక్షిణాఫ్రికా మార్కెట్లో విక్రయిస్తోంది. త్వరలో మహీంద్రా థార్ 5 డోర్ కూడా ఈ విభాగంలో చేరనుంది. 

త్వరలో విడుదలకానున్న కొత్త మహీంద్రా థార్ 5 డోర్ మోడల్ రెండు ఇంజిన్ ఎంపికలతో విడుదలయ్యే అవకాశం ఉంది. అవి 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ & 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది దాని ప్రత్యర్థి 5 డోర్ జిమ్నీ కంటే పెద్దదిగా ఉంటుంది. ఇప్పటికే థార్ అనేక సార్లు టెస్టింగ్ దశలో కనిపించింది. డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. అయితే ఇది 3 డోర్ థార్ కంటే కూడా పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది, కావున పనితీరు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.

(ఇదీ చదవండి: మారుతి సుజుకి ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది! లాంచ్ ఎప్పుడంటే?)

ఇండియా లాంచ్
మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & సీఈఓ (ఆటో అండ్ ఫార్మ్ సెక్టార్) రాజేష్ జెజురికర్ గతంలో ధృవీకరించినట్లుగా, మహీంద్రా 5-డోర్ థార్ 2024లో భారతదేశంలో విడుదల కానున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ SUV కి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడవుతాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)