Breaking News

మొన్న 300 మందికే.. ఇప్పుడు 999 మందికి

Published on Thu, 08/21/2025 - 21:19

మహీంద్రా ఇటీవల వార్నర్ బ్రదర్స్ సహకారంతో రూ. 27.79 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. లాంచ్ సమయంలో కేవలం 300 యూనిట్లకు మాత్రమే పరిమితమైన ఈ ఎడిషన్ ఇప్పుడు 999 యూనిట్లకు చేరింది. అంటే దీనిని 999 మంది కొనుగోలు చేయగలరు.

మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్‌ ఆగస్టు 21 సాయంత్రం 5 గంటల నుంచి మహీంద్రా అధికారిక వెబ్‌సైట్లో ఉంచింది. కాగా కంపెనీ ఈ మోడల్ కోసం ఆగస్టు 23 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించనుంది. డెలివరీలు సెప్టెంబర్ 20న ప్రారంభం కానున్నాయి.

మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్.. కస్టమ్ శాటిన్ బ్లాక్ బాడీ కలర్‌తో వస్తుంది. ముందు డోర్స్ మీద బ్యాట్‌మ్యాన్ డెకాల్స్, టెయిల్‌గేట్‌పై డార్క్ నైట్ బ్యాడ్జ్, ఫెండర్‌పై బ్యాట్‌మ్యాన్ లోగో, బంపర్ & రివర్స్ లాంప్‌ ఉన్నాయి. బ్రేక్‌లు, స్ప్రింగ్‌లు ఆల్కెమీ గోల్డ్ పెయింట్‌ పొందాయి. ఇది చూడగానే ఒక సూపర్ హీరోను గుర్తుకు తెస్తుంది.

ఇదీ చదవండి: భవిష్యత్ ఇంధనం గురించి చెప్పిన గడ్కరీ

మహీంద్రా బ్యాట్‌మ్యాన్ ఎడిషన్.. 79 kWh బ్యాటరీ ప్యాక్‌తో.. ఒకే ఫుల్ ఛార్జ్‌పై 682 కి.మీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 286 హార్స్ పవర్, 380 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుందని సమాచారం.

మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ లోపల కూడా అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ పొందుతుంది. డాష్‌బోర్డ్‌పై ఆల్కెమీ గోల్డ్‌లో నంబర్ ఉన్న బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ప్లేక్, ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ కోసం చార్‌కోల్ లెదర్ & గోల్డ్ సెపియా స్టిచింగ్‌తో కూడిన స్వెడ్ లెదర్ అపోల్ స్ట్రే వంటివి ఉన్నాయి. గోల్డ్ యాక్సెంట్‌లు స్టీరింగ్ వీల్, ఇన్ టచ్ కంట్రోలర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వరకు విస్తరించి ఉండగా, బ్యాట్ లోగో బూస్ట్ బటన్, సీట్లు మొదలైనవాటిపై కనిపిస్తాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)