Breaking News

మహీంద్రా కొత్త ప్లాంటు!

Published on Tue, 09/24/2024 - 05:54

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా కొత్త ప్లాంటు ఏర్పాటు యోచనలో ఉంది. ఇందుకోసం కంపెనీ మహారాష్ట్రలోని చకన్‌కు సమీపంలో స్థల సేకరణలో నిమగ్నమైనట్టు సమాచారం. మొత్తంగా ఆటోమోటివ్‌ పరిశ్రమకు సమీపంలో ఉండాలన్నది కంపెనీ భావన. మల్టీ ఎనర్జీ ప్లాట్‌ఫామ్‌ అయిన న్యూ ఫ్లెక్సిబుల్‌ ఆర్కిటెక్చర్‌ (ఎన్‌ఎఫ్‌ఏ) ఆధారిత వాహనాలను ఇక్కడ తయారు చేస్తారు.

 చకన్, పుణే, నాసిక్‌ ప్లాంట్ల వార్షిక తయారీ సామర్థ్యం 8 లక్షల యూనిట్లు. ఎన్‌ఎఫ్‌ఏ మోడళ్ల కోసం మరింత సామర్థ్యం అవసరం అవుతుంది. ఎన్‌ఎఫ్‌ఏ ఆర్కిటెక్చర్‌ సుమారు 12 మోడళ్లను తయారు చేసే అవకాశం ఉంది. కొత్త ప్లాట్‌ఫామ్‌ ద్వారా తయారైన మోడళ్ల అమ్మకాలు ఏటా 3–5 లక్షల యూనిట్లు ఉండొచ్చని కంపెనీ భావిస్తోంది. 

కాగా, కంపెనీ తన లక్ష్యాన్ని చేరుకున్నట్టయితే ప్రస్తుత ఆర్తిక సంవత్సరంలో తొలిసారిగా 5 లక్షల యూనిట్ల విక్రయాల మార్కును అందుకుంటుంది. మహీంద్రా మార్కెట్‌ వాటా రెండంకెలకు చేరుకోవచ్చు. 2024–25లో ఎస్‌యూవీల టర్నోవర్‌ రూ.75,000 కోట్లు దాటనుంది. 2023–24లో కంపెనీ ఎస్‌యూవీల తయారీలో పరిమాణం పరంగా భారత్‌లో రెండవ స్థానంలో, ఆదాయం పరంగా తొలి స్థానంలో నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 4.59 లక్షల యూనిట్లను విక్రయించింది. ఆటోమోటివ్‌ బిజినెస్‌ కోసం రూ.27,000 కోట్ల పెట్టుబడులు చేయనున్నట్టు మహీంద్రా అండ్‌ మహీంద్రా ఇప్పటికే ప్రకటించింది.   
 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)