Breaking News

సరికొత్త ఫీచర్లతో మహీంద్రా ఎక్స్‌యూవీ400 ప్రో రేంజ్‌

Published on Thu, 02/01/2024 - 19:39

సరికొత్త ఫీచర్లతో మహీంద్రా ఆల్‌ ఎలక్ట్రిక్‌ ఎక్స్‌యూవీ400 ప్రో రేంజ్‌ను మహీంద్ర అండ్‌ మహీంద్ర లిమిటెడ్‌ ఇటీవల విడుదల చేసింది.  మహీంద్రా ఎక్స్‌యూవీ400కి అప్‌డేటెడ్‌ వెర్షన్‌గా తీసుకొచ్చిన దీని ప్రారంభ ధర రూ. 15.49 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) కంపెనీ ప్రకటించింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ400 ప్రో రేంజ్‌లో మూడు వేరియంట్లు ఉన్నాయి. అవి ఈసీ ప్రో (EC Pro), రెండు ఈఎల్‌ ప్రో (EL Pro) వర్షన్లు.  మార్పుల విషయానికొస్తే, కొత్త వెర్షన్‌ల క్యాబిన్ రీడిజైన్ చేసిన డాష్‌బోర్డ్‌తో కొత్త బ్లాక్ అండ్ గ్రే ట్రీట్‌మెంట్‌తో వస్తోంది.

 

కొత్త ఫీచర్ల విషయానికి వస్తే, టాప్-స్పెక్ ఈఎల్‌ ప్రో వేరియంట్‌లో ఫ్లోటింగ్ 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, రివైజ్డ్ ఎయిర్‌కాన్ ప్యానెల్, రియర్ టైప్-సీ USB ఉన్నాయి. పోర్ట్, వెనుక మొబైల్ హోల్డర్, కొత్త ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

 

మహీంద్రా ఎక్స్‌యూవీ400 ప్రో రేంజ్‌లో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి.  వీటిలో 34.5kWh బ్యాటరీ ప్యాక్ ఒక్క సారి చార్జ్‌ చేస్తే  375 కిమీల డ్రైవింగ్ రేంజ్‌ను ఇస్తుందని, 39.4kWh యూనిట్ 456కిమీల డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. వీటికి బుకింగ్స్‌ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం కాగా ఫిబ్రవరి 1 నుంచి డెలివరీలను కూడా కంపెనీ ప్రారంభించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)